తుమ్మినప్పుడు కళ్లు మూయనని ఛాలెంజ్.. తర్వాత ఏమైందంటే..?

జలుబు చేసినప్పుడు బాగా తుమ్ములు వస్తూ ఉంటాయి.అలాగే సాధారణంగా కూడా తుమ్ములు అనేవి వస్తూ ఉంటాయి.తుమ్ము వచ్చినప్పుడు కళ్లు ఆటోమేటిక్ గా మూసుకుపోతూ ఉంటాయి.తుమ్ము వచ్చినప్పుడు కళ్లు తెరిచి ఉంచడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు.కానీ అది సాధ్యమేనని నిరూపించింది ఒక అమ్మాయి.ఈ అమ్మాయి చేసిన ఫీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

 The Challenge Of Not Closing Your Eyes When You Sneeze What Happened Next , Caug-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక అమ్మాయికి తుమ్ము వచ్చినప్పుడు కళ్లు ( eyes )తెరిచి ఎందుకు ఉంచకూడదనే ఆలోచన వచ్చింది.

దీంతో తుమ్ము వచ్చినప్పుడు కళ్లు తెరిచి ఉంచుకుని వీడియో తీసింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.తుమ్ము రావడం కోసం ఈ అమ్మాయి పెన్నును ముక్కులో పెట్టుకుంది.ఆ తర్వాత తుమ్ము( sneeze ) రాగానే కళ్లు మూయకుండా తుమ్మింది.

కనురెప్పులు కాస్త కదిలినట్లు వీడియోలో కనిపిస్తుండగా కళ్లు మాత్రం మూయకుండా అలాగే ఉండగలిగింది.

ఈ ఛాలెంజ్ పూర్తి కాగానే ఈ అమ్మాయికి బాగా నవ్వు వచ్చింది.ఈ వీడియోకు నెటిజన్లు అనేక రకాల కామెంట్స్ పెడుతున్నారు.తుమ్ము తెప్పించుకోవడానికి మేకప్ బ్రష్ ను వాడాలా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

ఇక మరికొంతమంది నకిలీ వీడియోలను పోస్ట్ చేసే వ్యక్తుల కంటే ఇలాంటి అసలైన వీడియోలు ఫన్నీగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు.దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

కొంతమందికి తుమ్ము మీద అనేక నమ్మకాలు ఉంటాయి.పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే ఆ పని జరగదని, గడప మీద కూర్చుని తుమ్మకూడదని చెబుతూ ఉంటారు.

అలాగే కొంతమంది తుమ్మను బలవంతంగా ఆపుకుంటూ ఉంటారు.ఇలా ఆపుకోవడం వల్ల నరాలు దెబ్బతింటాయని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube