చికెన్ ప్యాకెట్ కొట్టేసిన పిల్లి.. తర్వాత ఏం చేసిందో చూస్తే ఫిదా అవుతారు..

తల్లి, బిడ్డల మధ్య ఉన్న అనుబంధం అద్భుతమైనది.అది మాటల్లో వర్ణించలేనిది.

 The Cat That Knocked Over The Chicken Packet Mother Cat, Kittens, Chicken Packet-TeluguStop.com

తల్లి తన బిడ్డలపై ఎనలేని మమకారం కలిగి ఉంటుంది, బిడ్డ పుట్టినప్పటి నుంచి వారి ప్రేమ ప్రారంభమవుతుంది.ఈ అనుబంధం మానవులలో మాత్రమే కాకుండా జంతువులలో కూడా ఉంటుంది.

ఇటీవల సోషల్ మీడియా( Social media )లో వైరల్ అయిన ఒక ఘటన దీనిని నిరూపిస్తుంది.

ఒక తల్లి పిల్లి తన ఆకలితో ఉన్న పిల్లులకు ఆహారం ఇవ్వడానికి సూపర్ మార్కెట్ నుండి చికెన్ బ్యాగ్‌ను దొంగిలించింది.ఈ హార్ట్ టచింగ్ ఘటన కెమెరాలో చిక్కి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ రోడ్డుకు అడ్డంగా బరువైన చికెన్ బ్యాగ్‌( Chicken packet )ని తీసుకువెళ్లేందుకు పిల్లి కష్టపడుతున్నట్లు వీడియోలో కనిపించింది.టర్కీలో ఈ సంఘటన జరిగిందని తెలిసింది.2023, సెప్టెంబరు 14న ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ వీడియో అప్‌లోడ్ అయింది.

ఒక టర్కిష్ పిల్లి a101 అనే సూపర్ మార్కెట్( Turkey ) నుండి చికెన్ బ్యాగ్‌ను దొంగిలించింది.వాటిని తన పిల్లల కోసం తీసుకువెళ్లింది.” అని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు.ఈ వీడియో 1 కోటికి పైగా వ్యూస్ పొందింది.

పిల్లి తల్లి ప్రేమ, దృఢ నిశ్చయంతో హార్ట్ టచ్ చేసిందని నెటిజన్లు వేలకొద్దీ కామెంట్స్ చేశారు.చాలా మంది ప్రజలు పిల్లి కష్టపడి పనిచేసే, స్వతంత్ర తల్లి అని ప్రశంసించారు, ఆమె పిల్లుల ఆహారం కోసం ఏదైనా చేస్తుందని అన్నారు.

కొంతమంది వ్యక్తులు పిల్లి భద్రత, శ్రేయస్సు గురించి ఆందోళన వ్యక్తం చేశారు.దానితో పాటు దాని పిల్లులకు మంచి ఇల్లు లభిస్తుందని ఆశించారు.

దీనికి మదర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వాలని ఒక నెటిజెన్ కామెంట్ పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube