డబ్బు వస్తున్న జబర్దస్త్ మానేయడానికి అదే కారణం... అసలు విషయం చెప్పిన వేణు!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ వేణు ఒకరు.ఈ కార్యక్రమం మొదట్లో వేణు టీం లీడర్ గా జబర్దస్త్ కార్యక్రమంలో తన అద్భుతమైన స్కిట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసేవారు.

 Thats The Reason To Stop Jabardast Which Is Getting Money Venu Said The Real Thi-TeluguStop.com

అయితే కొన్ని కారణాలవల్ల వేణు జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు.ఇలా ఈయన బయటికి రావడానికి గల కారణం మల్లెమాల వారితో ఈయనకు ఉన్నటువంటి మనస్పర్ధలే కారణమని ఆ గొడవల కారణంగానే బయటికి వచ్చారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి విడిపోవడానికి కారణం ఇదేనంటూ ఇన్ని రోజులు వార్తలు వైరల్ అయినప్పటికీ తాజాగా వేణు ఈ వార్తలపై స్పందించారు.తాజాగా ఈయన దర్శకుడిగా మారిన సంగతి మనకు తెలిసిందే.అఖిల్ రాజు నిర్మాణంలో ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన బలగం సినిమా ద్వారా ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.మొదటి సినిమాతోనే వేణు దర్శకుడుగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకొని అందరిని ఆశ్చర్యపరిచారు ఇలా దిల్ రాజుకు బలగం సినిమా విషయంలో మంచి లాభాలను తీసుకురావడంతో దిల్ రాజు తనకు మరొక అవకాశాన్ని కూడా ఇచ్చినట్టు సమాచారం.

దిల్ రాజు నిర్మాణంలో వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వేణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడానికి గల కారణాలను తెలియజేశారు.ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ తనకు మల్లెమాల వారితో ఉన్న మనస్పర్ధలు కారణంగానే బయటకు వచ్చానని వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని, తనకు సినిమాలు అంటేనే పిచ్చి అని ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్న కసి నాలో ఉందని ఆ ఒక్క కారణంతోనే డబ్బు పేరు వస్తున్న జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చానని, ఈ సందర్భంగా వేణు క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube