రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలను గాలిలో కలుస్తున్నాయి.అతి వేగంతో రహదారులు అన్ని రక్తపు మడుగులతో దర్శనం ఇస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే మద్యం మత్తులో కొందరు, నిద్రమత్తులో మరికొందరు ఈ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.తాజాగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రయాణం చేస్తూ రోడ్డు పక్కన కారు ఆపి సేద తీరుతున్న కుటుంబాన్ని మరో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది.ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
పూర్తీ వివరాల్లోకి వెళ్తే.
కృష్ణాజిల్లా కృత్తివెలు మండలం ఇంటేరు గ్రామానికి చెందిన కుటుంబం హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు.
నాగమల్లేశ్వరరావు కుటుంబం కారు మాట్లాడుకొని విజయవాడ వెళ్లి మళ్లీ హైదరాబాద్ వస్తున్నారు.వారు మధ్యలో మునగాల మండల పరిధిలోని మొద్దుల చెరువు సమీపంలో కుటుంబం మొత్తం కారు దిగి రోడ్డు పక్కన నిలబడ్డారు.
డ్రైవర్ ఒక్కరే కారులో ఉన్నారు.వెనకాల నుంచి వస్తూన్న కారు అతివేగంతో వారిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.మృతి చెందిన వారిని వడుగు నాగమల్లేశ్వరరావు (40), అతని భార్య మామూలమ్మ (34) కుమార్తె దుర్గ (12) గా పోలీసులు గుర్తించారు.
కొండబాబుకు గాయాలు అవడంతో దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దుర్ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరైయ్యారు.