1.తానా , గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కేన్సర్ వైద్య శిబిరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) , గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చాగల్లు కాకతీయ కళ్యాణ మండపం లో ఉచిత మెగా కేన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
2.దక్షిణాఫ్రికా ప్రయాణికులపై మహారాష్ట్ర ఆంక్షలు
కొత్త కరోనా వేరియంట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో , దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.వారిని తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉండాల్సిందిగా నిబంధనలు విధించారు.
3.నాట్స్ ఆధ్వర్యంలో బ్యాక్ టు స్కూల్ కార్యక్రమం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( నాట్స్ ) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యాక్ టు స్కూల్ ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వివిధ విద్యా సామాగ్రి అందించారు.
4.ఏడు దేశాల ప్రయాణికులపై యూఏఈ బ్యాన్
కరోనా కొత్త వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త వేరియంట్ ప్రభావం ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఉండడంతో , అక్కడ ఏడు దేశాలపై యూఏఈ ప్రభుత్వం ‘ ట్రావెల్ బ్యాన్ ‘ విధించింది.
5.అంతర్జాతీయ సర్వీసులపై భారత్ కీలక నిర్ణయం

కరోనా నేపథ్యంలో నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులు పై భారత్ కీలక నిర్ణయం తీసుకుంది .డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది.
6.వర్కింగ్ వీసా మరింత సులభతరం చేసిన కువైట్
వర్కింగ్ వీసాలను కువైట్ మరింత సులభతరం చేసింది.త్వరలో వర్క్ పర్మిట్ లను ఆన్లైన్ ద్వారా జారీ చేయనుంది.
7.సౌత్ ఆఫ్రికా విమానంలో కరోనా కలకలం

సౌతాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుల్లో 60 కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటపడడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. దీంతో సౌత్ ఆఫ్రికా దేశాలపై అంతర్జాతీయంగా ఒక్కో దేశం ట్రావెల్ బ్యాన్ విధిస్తూ వస్తున్నాయి.
8.న్యూయార్క్ లో ఎమెర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
కొత్త కరుణ వేరే విజృంభిస్తుండడంతో అమెరికాలోని న్యూయార్క్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు.
9.డబ్లు టివో సదస్సు రద్దు

కొత్త కరోనా వేరియంట్ బయటపడడంతో వచ్చేవారం జెనీవాలో జరగాల్సిన డబ్ల్యుటివో అంతర్జాతీయ సదస్సును రద్దుచేశారు.