నడకరాని పిల్లలు నడవడం కోసం ఎంత తాపత్రయపడాతారో ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్దితి కూడా ఇలాగే ఉందట.ఒక్కసారి చేయి జారిపోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయాత్నాలను చూస్తుంటే ఓటమికే కన్నీళ్లు వచ్చేలా ఉన్నాయంటున్నారట.
అయిన పొలాన్ని దున్నే ఎద్దులు ఆరోగ్యంగా, సక్రమంగా ఉండాలే గానీ కుంటిగా, గుడ్దిగా ఉంటే ఇక ఆ రైతు పొలం దున్నినట్లే.
ఇప్పుడు కాంగ్రెస్ పరిస్దితి కూడా ఇలాగే తయారు అయ్యిందట.
ప్రతి విషయాన్ని నానబెట్టి విసుగు పుట్టేలా చేస్తుందట అధిష్టానం.ఇందుకు ఉదాహరణ తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి గురించి జరిగిన రచ్చ మామూలుగా లేదన్న విషయం తెలిసిందే.
ఆ వివాదం సమసిపోతుందని భావిస్తున్న క్రమంలో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిపై రచ్చ మొదలైందట.అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే మాట అటుంచితే ముందుగా పదవుల కోసం ప్రాకులాడటం మానుకుని పార్టీ కోసం, ప్రజా సమస్యల కోసం ఆలోచిస్తే మంచిదని సామాన్యుడి మనోగతమట.