తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు.ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తో పాటు డీకే అరుణ, ఈటల రాజేందర్, వివేక్ లు హస్తినకు పయనంకానున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై హైకమాండ్ తో నేతలు చర్చించనున్నారని సమాచారం.అదేవిధంగా మర్రి శశిధర్ రెడ్డి చేరికపైనా కూడా చర్చించే అవకాశం ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకున్న సమయంలో బీజేపీ నేతలు ఢిల్లీకి పయనం కావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అదేవిధంగా బీఎస్ సంతోష్ కు నోటీసులు, ఐటీ దాడులపై రాష్ట్ర నేతలు చర్చించనున్నారని సమాచారం.
అయితే బీఎల్.సంతోష్ కు నోటీసులపై బండి సంజయ్ తప్ప పార్టీలోని ఇతర నాయకులు ఎవరూ స్పందించలేదు.
ఈ క్రమంలో ఆయనకు మరోసారి నోటీసులు ఇస్తే అనుసరించాల్సిన వ్యూహంపై జాతీయ నేతలు దిశానిర్దేశం చేయనున్నారు.