అసెంబ్లీలో కరోనా కలకలం... పాస్ లు జారీచేసే ఉద్యోగికి పాజిటివ్

తెలంగాణా లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులు కూడా కాకుండానే కరోనా కలకలం మొదలైంది.అసెంబ్లీ నిర్వహణ సందర్భంగా కరోనా విషయంలో స్పీకర్, ప్రభుత్వం పకడ్భందీ చర్యలు తీసుకుంది.

 Employee Of Telangana Assembly Tests Corona Positive , Telangana Assembly,corona-TeluguStop.com

అసెంబ్లీకి వచ్చే ప్రజాప్రతినిధులతో పాటు విధులు నిర్వహించే సిబ్బంది అంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని.అందులో నెగిటివ్ అని తేలితేనే అసెంబ్లీలోకి అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

ఈ రకమైన చర్యలతోనే రెండు రోజులు అసెంబ్లీ కూడా నిర్వహించారు.అయితే అసెంబ్లీ లో పాసులు జారీ చేసే కౌంటర్ లో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడం తో కలకలం మొదలైంది.దీంతో… అసెంబ్లీకి ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది.ఆ ఉద్యోగి ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారినే అసెంబ్లీలోకి అనుమతి ఇస్తున్నారు.అయితే అసెంబ్లీ సమావేశాలకు కొద్దిరోజుల ముందు నిర్వహించిన పరీక్షల్లో ఆ ఉద్యోగికి నెగిటివ్ వచ్చిందని… అయితే నిన్న కరోనా లక్షణాలు కనిపించడంతో మరోసారి పరీక్షలు చేయించుకున్న ఆ ఉద్యోగి తనకు పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.

దీంతో ఆ ఉద్యోగి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌కు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు.మొత్తానికి అసెంబ్లీ ఉద్యోగికి కరోనా అని తేలడంతో.ఇందుకు సంబంధించి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందా అనే చర్చ మొదలైంది.కాగా.

నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.అయితే అసెంబ్లీలో ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో… రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయోనని అందరిలో ఆందోళన మొదలైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube