టెక్నాలజీ: వాయిస్ మెసేజ్‌ లలో కొత్త ఫీచర్ తీసుకరాబోతున్న వాట్సాప్‌..!

వాట్సాప్‌ తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇప్ప‌టి వ‌ర‌కు టెక్ట్స్ మెసేజ్‌ లను మాత్ర‌మే స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని పంపేవాళ్లం.

 Technology Whatsapp Is Going To Bring A New Feature In Voice Messages , Technolo-TeluguStop.com

కానీ ఈ సౌల‌భ్యం వాయిస్ మెసేజ్‌ లకు లేదు.ఒక‌సారి రికార్డు చేసిన తర్వాత పంప‌డ‌మో, లేక డిలీట్ చేయ‌డ‌మో మాత్రమే చేయాల్సి ఉంటుంది.

రికార్డు చేసింది.క‌రెక్ట్ గా ఉందో లేదో సెండ్ చేయ‌కముందు వినే అవ‌కాశం లేదు.

పంపిన త‌ర్వాతే వినాలి.కానీ ఇప్పుడు వాయిస్ మెసేజ్ ల‌ను సెండ్ చేయ‌క‌ముందే అది క‌రెక్టుగా ఉందో లేదో వినే ఫీచ‌ర్ ను వాట్సాప్ తీసుకురానుంది.

అంతేకాకుండా వాయిస్‌ మెసేజ్‌ లను యూజర్లు ఎంపిక చేసుకున్న స్పీడ్‌ ల‌లో వినే అవ‌కాశం ఉంటుంది.రానున్న‌ రోజుల్లో వాయిస్‌ మెసేజ్‌ లను సెండ్ చేసేప్పుడు ‘రివ్యూ’ బటన్ తో వినేలా వాట్సాప్ ఓ ఫీచ‌ర్ తెస్తోంది.

ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఫోన్ లలో వాట్సాప్‌ తీసుకురానుంది.

గ‌త కొన్ని రోజుల క్రితం ప్రైవ‌సీ విష‌యంలో వాట్సాప్ కాస్త ఎదురుదెబ్బ ఎదుర్కొన్న విష‌యం తెల‌సిందే.

యూజ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో యాజ‌మాన్యం వెనుక‌డుగు వేసింది.దీంతో కోల్పోయిన న‌మ్మ‌కాన్ని మ‌ళ్లీ రాబ‌ట్టుకోవ‌డానికి వాట్సాప్ కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజర్ల‌ను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఈ క్ర‌మంలో ఇటీవ‌లి కాలంలో ప‌లు అప్‌డేట్ల‌తో వ‌స్తోందీ మేసేజింగ్ యాప్‌.ఇందులో భాగంగానే ఈ కొత్త ఫీచ‌ర్‌ ను తీసుకురానుంది.

ప్ర‌స్తుతం వాట్సాప్ ఈ కొత్త ఫీచ‌ర్‌ను టెస్టింగ్ చేస్తోంది.ఇక రికార్డు చేసిన వాయిస్ మెసేజ్‌ ను వినే వేగాన్ని కూడా యూజ‌ర్ ఎంచుకునే అవ‌కాశాన్ని ఈ ఫీచ‌ర్ ద్వారా అందించ‌నున్నారు.

రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్‌ను పంపే స‌మ‌యంలో రివ్యూ బ‌ట‌న్ ద్వారా రికార్డు చేసిన మెసేజ్‌ ను వినే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.ఈ ఫీచర్ వాట్సాప్ వినియోగదారులకు ఒక వరమనే చెప్పాలి.

చూడాలి మరి ఈ కొత్త అప్డేట్ వినియోగదారులకు ఏవిధంగా ఉపయోగపడుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube