టీడీపీ సర్వే రిపోర్ట్.. అనుకూలమా ప్రతికూలమా !

ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికి ప్రధాన పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేశాయి.ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమాగా ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వస్తున్న సర్వేలు చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

 Tdp Survey Report.. Positive Or Negative , Chandrababu Naidu , Tdp Party , Ycp-TeluguStop.com

ఇప్పటివరకు వచ్చిన సర్వేలల్లో కొన్ని వైసీపీకి( YCP party ) ఫేవర్ గా వస్తే మరికొన్ని టీడీపీ( TDP party )కి అనుకూలంగా వచ్చాయి.అయితే బహిర్గతంగా బయటకు వస్తున్న సర్వేలు కొన్నైతే.

పార్టీలు అంతర్గతంగా చేయించే సర్వేలు మరికొన్ని ఉంటాయి.ఈ నేపథ్యంలో టీడీపీ చేయించిన అంతర్గత సర్వేపై ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap, Bjp, Chandrababu, Congress, Telugu Desam, Ycp-Politics

రాష్ట్రంలోని 175 నియోజిక వర్గాలల్లో ప్రస్తుత ప్రభుత్వ పని తీరుపై అలాగే చంద్రబాబు( Chandrababu Naidu ) హయంలో జరిగిన పాలన ప్రజెంట్ వైఎస్ జగన్ హయంలోని పాలన మద్య వ్యత్యాసం.వంటి అంశాలను తీసుకొని సర్వే చేయించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.రాష్ట్రంలో 95 శాతం ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని టీడీపీ అంతర్గత సర్వేలో తేలిందట.ఇక వచ్చే ఎన్నికల్లో ఎవరి పాలన కోరుకుంటున్నారనే దానిపై కూడా స్పష్టమైన రిపోర్ట్ అందిందని తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) నేతలు చెబుతున్నారు.

దాదాపు 90 శాతం ప్రజలు చంద్రబాబు పాలననే మళ్ళీ కోరుకుంటున్నారట.అందుకే ఈసారి ఎన్నికల్లో 160 సీట్లు టీడీపీ గెలుచుకోవడం గ్యారెంటీ అని తెలుగుదేశం పార్టీ నేతలు గంటాపథంగా చెబుతున్నారు.

Telugu Ap, Bjp, Chandrababu, Congress, Telugu Desam, Ycp-Politics

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ అభివృద్దిమ సంక్షేమం సమపాళ్ళలో ఉండేదని, కానీ ఇప్పుడు సంక్షేమం ఉంటే అభివృద్ది లేదని, అభివృద్ది ఉంటే సంక్షేమం లేదని చెబుతున్నారు టీడీపీ శ్రేణులు.అందుకే మెజారిటీ ప్రజలు చంద్రబాబు పాలననే కోరుకుంటున్నారని ఆ పార్టీ పదే పదే చెబుతోంది.అయితే ఇది సొంత సర్వే అని టీడీపీకి ఆ స్థాయి సానుకూలత లేదని వైసీపీ సానుభూతిపరులు చెబుతున్నా మాట.2014 లోని బాబు పాలనపై విరక్తి చెందిన ప్రజలు 2019లో గద్దె దించారని తిరిగి బాబు పాలన కోరుకోవడం లేదనేది వారు చెబుతున్నారు.మరి టీడీపీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నా సర్వే ఫలితాలు ఆ పార్టీకి అనుకూలమా ? లేదా ప్రతికూలమానేది వచ్చే ఎన్నికల్లో డిసైడ్ అవ్వనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube