ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Leader Pawan Kalyan ) భీమవరం నుంచి పోటీ చేస్తారని అంత భావించారు.దీనికి తగ్గట్లు గానే పవన్ కూడా భీమవరం( Bhimavaram ) నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు.ఆయన భీమవరంలో ఒక ఇల్లును కూడా తీసుకుని మకాం ఉండబోతున్నారనే ప్రచారం జరిగింది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గంలో ఓటమి చెందడంతో మళ్లీ భీమవరం నుంచి పోటీ చేసి గెలిచి తన సత్తా చాటుకోవాలని పవన్ భావించారు.అయితే ఇప్పుడు పవన్ ఆ నిర్ణయం మార్చుకున్నట్టుగా కనిపిస్తున్నారు.తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం( Pithapuram ) నుంచి పోటీ చేసేందుకు పవన్ ఆసక్తి చూపిస్తున్నారు.దీంతో భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీకి దిగుతారనే విషయంలో సస్పెన్స్ నెలకొనగా.దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది.
వచ్చే ఎన్నికల్లో టిడిపి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇక్కడ నుంచి జనసేన తరపున పోటీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం టిడిపిలో ఉన్న పులపర్తి( TDP Pulaparthi Ramanjaneyulu ) మరో రెండు రోజుల్లో జనసేనలో చేరబోతున్నారట.ఈ విషయాన్ని స్వయంగా పులపర్తి రామాంజనేయులు వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో తనను భీమవరం నుంచి పోటీ చేయమని పవన్ అడిగారని, పవన్ కు భీమవరంలో పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పి, తనను పోటీ చేయమని అడిగారని పులపర్తి రామాంజనేయులు వెల్లడించారు.
తానేమో పవన్ ను పోటీ చేయమని కోరినా వద్దన్నారని రామాంజనేయులు చెబుతున్నారు.దీంతో ఈ నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులు పోటీ చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది.
అయితే ఇప్పటి వరకు భీమవరం నుంచి పవన్ పోటీ చేస్తారంటూ జనసేన( Janasena ) హడావుడి చేసినా, భీమవరం కేంద్రంగా అనే సభలు, సమావేశాలు పెట్టినా, ఎన్నికల సమయం దగ్గర పడిన సమయంలో పవన్ ఇక్కడ పోటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అయితే జనసేనలో చాలామంది కీలక నేతలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు.యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ, క్షేత్రస్థాయిలో జనసేన ను బలోపేతం చేస్తున్నారు.కానీ అటువంటి వారికి టికెట్ ఇవ్వకుండా టిడిపి మాజీ ఎమ్మెల్యేలను జనసేనలో చేర్చుకుని మరీ టిక్కెట్ ఇవ్వడం పైనే, పవన్ వైఖరి పార్టీ నాయకులకు కూడా అర్థం కావడం లేదు.