చేరికలపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న టిడిపి ??

TDP Maintaining Strategic Silence On Inclusions Details, TDP,TDP Latest News,Chandrababu,Ap Politics Latest News,Chandrababu Latest Strategics News,Inclusions,Inclusions In Tdp

ఆంధ్ర ప్రదేశ్( Andra Pradesh ) లో జగన్ ( CM Jagan )ప్రభుత్వం పై ప్రజావ్యతిరేకత దారుణంగా పెరిగిపోయిందంటూ తెలుగుదేశం( TDP Party ) నేతలు, దాని అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నారు .సంక్షేమ పథకాల పేరుతో ప్రజల ఖాతాల్లో డబ్బులు వేయడమే తప్ప అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ మౌలిక వసతులు గురించి కానీ పంచాయతీల సమస్యల గురించి గానీ కనీసం పట్టించుకోని ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం ఉందని ప్రత్యర్థుల విమర్శలు చేస్తున్నారు.

 Tdp Maintaining Strategic Silence On Inclusions Details, Tdp,tdp Latest News,cha-TeluguStop.com

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్ ప్రభుత్వం ఓడిపోతుందని, ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని , ప్రజల్లో జగన్ విశ్వాసం కోల్పోయారని ఇలా అనేక కథనాలతో తెలుగుదేశం మీడియా వరుస కథనాలను ప్రసారం చేస్తుంది.

Telugu Ap Latest, Chandrababu, Tdp, Tdp Latest-Telugu Political News

అయితే నిజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంటే తెలుగుదేశం పార్టీలోకి వలసలు పెరగాలి కానీ గత సంవత్సర కాలంగా చెప్పుకోదగ్గ నాయకులెవరూ తెలుగుదేశం పార్టీలో చేరలేదు.ఒకపక్క తెలుగుదేశం పార్టీ ని బలపరచడం కోసం అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఇప్పటికే రాయలసీమలో మూడు జిల్లాలను చుట్టేసినా కూడా చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ తెలుగుదేశం లోకి చేరలేదు.

Telugu Ap Latest, Chandrababu, Tdp, Tdp Latest-Telugu Political News

అయితే ఇదంతా తెలుగుదేశం వ్యూహాత్మక మౌనమని, అధికార పక్షానికి గట్టి షాక్ ఇవ్వడానికే ఇదంతా గోప్యంగా ఉంచుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి.గత సంవత్సర కాలంగా తెలుగుదేశం రాజకీయంగా చాలా బలపడిందని చాలామంది తటస్థ నాయకులతో పాటు వైసిపి నాయకులు కూడా చాలామంది తెలుగుదేశంతో టచ్ లో ఉన్నారని వీరందరినీ రాజమండ్రిలో జరిగే మహానాడు వేదిక ఒక్కసారిగా పార్టీలోకి చేర్చుకొని అధికార పక్షానికి జలక్ ఇవ్వడానికి తెలుగుదేశం చూస్తుందంటూ విశ్లేషణలు వస్తున్నాయి.రాజమహేంద్రవరం వేదికగా ఈనెల 27, 28వ తారీకుల లో జరిగే పార్టీ మహానాడు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్న తెలుగుదేశం ,ఆ కార్యక్రమం వేదికగానే పార్టీలోకి చేరుతున్న నేతలను ప్రకటిస్తారని తద్వారా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెంచుతారని విశ్లేషణలు వస్తున్నాయి,మహానాడు కార్యక్రమానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నందున మరి తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో నాయకులను ఆకర్షించగలిగిందో ఆరోజు తేలిపోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube