విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో టిడిపి ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ వెంకన్న మాట్లాడుతూ సామాజిక బస్సు యాత్ర పేరుతో ప్రయాణిస్తున్న వారు మనుషులా దున్నపోతులా.మీరు మంత్రులైతే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల గోడు విన్నారా.
నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టకుండా,బస్సు యాత్ర పేరుతో గ్రామాల్లోకి వెళ్లి దండుపాలెం గ్యాంగ్ లా మారారు.వాలంటీర్లను పంపించి బాధి రైతులను బెదిరించి మీటింగ్ లకు రావాలని ఒత్తిడి చేస్తారా.
మీరు మనుషులైతే ఆ పని చేయరు.ఏరైతు నైనా పరామర్శించారా.
రైతులు ఏమైపోయినా పర్వాలేదా.వారి బాధలను పట్టించుకోకుండా బస్సు యాత్రలు చేస్తారా.
టిడిపి అధికారంలో లేకపోయినా నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లి చంద్రబాబు మాట్లాడారు.వారి సమస్యలను కేంద్రానికి తెలియపరిచారు.
కానీ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మొద్దు నిద్రపోతున్నారు.మా ఎస్సీలు మా బీసీలు మామ మైనార్టీలు అని ఎందుకు మాట్లాడతావు.బీసీ మంత్రులని బస్సు యాత్రల పేరుతో పంపిస్తావా.ఇది బుద్ధి లేకుండా చేసే యాత్ర.
జగన్ రెడ్డి రోజు లెక్కపెట్టుకుంటున్నాడు.ప్రజలకు మేలు చేద్దామనే పరిస్థితుల్లోలేడు.
బాధితులను పరామర్శించడానికి వారికి సమయం లేదు.ఎందుకు రైతుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు.
నీపాలనలో పలానా వారు రాష్ట్రంలో బాగుపడ్డారని చెప్పగలవా.సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణా రెడ్డి, సాయిరెడ్డి వంటి వారే బాగుపడ్డారు.
ఏపిలో ఒక్క పరిశ్రమ బాగుందని చెప్పగలరా.
రైతులు బాగున్నారని చెప్పగలరా.
తడిసిన ధాన్యాన్ని ఎంతకి కొన్నారో చెప్పగలరా.దోచుకున్న దాంట్లో 10 శాతం పంచినా రైతులు బాగుపడతారు.
వరదలు వస్తే గాలిలో వెళ్లి చూస్తావా చంద్రబాబు మాత్రం రైతుల దగ్గరికి వెళ్లి కష్టాలు తెలుసుకున్నారు.రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారో,వాటిని విడిపిస్తాము.
రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బస్సులు యాత్ర నిర్వహిస్తున్నారు.జగన్ రెడ్డికి భజన చేయడానికి యాత్రలు చేస్తున్నారు.
తెలుగుదేశం అధికారులోకి రాగానే తాడేపల్లి, ఇడుపులపాయి ప్యాలెస్ లలో దాచుకున్న డబ్బును వెలికి తీస్తాము.మీరు నిజమైన మంత్రులేనని నిరూపించుకోవాలనుకుంటే బస్సు యాత్ర ఆపి రైతుల దగ్గరికి వెళ్లాలి.
ఇప్పుడున్న పరిస్ధితుల్లో జగన్ రెడ్డి గురించి గొప్పగా చెప్తే ప్రజలు తరిమి తరిమి కొడతారు.రైతులు తీవ్రంగా నష్టపోయి బాధల్లో ఉంటే సాక్షాత్తు వ్యవసాయ మంత్రి సామాజిక బస్సు యాత్రలో పాల్గొంటారా.
జగన్ రెడ్డి పులివెందులలో కూడా ఓడిపోతారు.అందుకు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే సూచిక అని అన్నారు.