వైసీపీ అధ్యక్షుల మార్పు నిరంతర ప్రక్రియని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు అన్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు వల్ల తమ అధ్యక్షులను మార్చలేదనడం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబు తాను రౌడీనంటూ దారుణంగా మాట్లాడారని తెలిపారు.టీడీపీ అంటేనే బూతుల పార్టీ అని విమర్శించారు.
చంద్రబాబుకు మళ్లీ ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.ప్రజల్లోకి వెళ్లలేక చంద్రబాబు ఉక్రోషాన్ని వెల్లగక్కుతున్నారని విమర్శించారు.
ఈ క్రమంలోనే తనవి ఆఖరి ఎన్నికలని, ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి, లేదంటే ఇంటికి వెళ్తానంటూ వ్యాఖ్యనించారని మంత్రి ఎద్దేవా చేశారు.