స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు.థమన్ సాంగ్స్ లో చాలా సాంగ్స్ కాపీ అని ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఆ సాంగ్స్ విషయంలో ఎవరూ కోర్టును ఆశ్రయించకపోవడంతో ఇప్పటివరకు థమన్ కు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.ప్రస్తుతం థమన్ చేతినిండా సినిమా ఆఫర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.
థమన్ మ్యూజిక్ అందించిన వీరసింహారెడ్డి సినిమా నుంచి రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.జై బాలయ్య సాంగ్ రేపు రిలీజ్ కానుండగా ఈ సాంగ్ లీక్డ్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ సాంగ్ ను విన్న నెటిజన్లు విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మా సినిమాలోని టైటిల్ సాంగ్ ను గుర్తు చేసే విధంగా ఈ సాంగ్ ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
థమన్ పాటలు కాపీ కామెంట్లను ఎదుర్కొంటూ ఉండటంతో థమన్ అభిమానులు ఫీలవుతున్నారు.
బాలయ్య అభిమానులు సైతం బాలయ్య సినిమాకు థమన్ అన్యాయం చేశాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.బాలయ్య సినిమా పాటలు నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని మేము కోరుకుంటే థమన్ మాత్రం ఈ విధంగా చేస్తున్నాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న థమన్ ఆ పారితోషికానికి తగిన న్యాయం చేయలేకపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో థమన్ మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.థమన్ కాపీ సాంగ్స్ ఇస్తే రాబోయే రోజుల్లో ఆయనకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఆఫర్లు తగ్గే అవకాశం ఉంది.నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్న నెగిటివ్ కామెంట్ల విషయంలో థమన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.