ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి మాట్లాడాలి అన్న బయటకు చెప్పాలి అన్న భయపడే నటీనటులు ఈ మధ్యకాలంలో ఎటువంటి భయం లేకుండా వారికి జరిగిన చేదు అనుభవాల గురించి క్యాస్టింగ్ కౌచ్( Casting Couch ) అనుభవాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడడంతో పాటు డైరెక్టర్ ల పేర్లు నిర్మాతల పేర్లు బయట పెట్టేస్తున్నారు.ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
తాజాగా మరో బాలీవుడ్ నటి కూడా నిర్మాత తనని రూమ్ లోకి రమ్మని పిలిచాడు అంటూ సంచలన విషయాలను బయటపెట్టింది.
ఆ వివరాల్లోకి వెళితే.తారక్ మెహతా నటి జెన్నిఫర్ మిస్త్రీ( Jennifer Mistry ) తాజాగా సంచలన ఆరోపణలు చేసింది.నిర్మాత అసిత్ మోడీ( Producer Asit Modi ) తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు.
తనతో విస్కీ తాగడానికి రూమ్‌కు రావాలని రెండుసార్లు పిలిచాడని తెలిపింది.అయితే అతని ప్రతిపాదనను తిరస్కరించడంతో సిట్‌కామ్‌లోని తన సీన్స్‌ను తొలగించాడని ఆమె చెప్పుకొచ్చింది.కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ షాకింగ్ విషయాలను వెల్లడించింది.పాపులర్ సిట్‌కామ్ తారక్ మెహతా కా ఊల్టా చష్మా షోలో రోషన్ సోధి పాత్రను పోషించిన జెన్నిఫర్ మిస్త్రీ నిర్మాత లైంగిక వేధింపులతో షో నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది.
మీరు చాలా అందంగా ఉన్నారంటూ తనపై పొగడ్తలు కురిపించేవారని ఆమె చెప్పుకొచ్చింది.అతనితో కలిసి విస్కీ తాగేందుకు రావాలని పలు సందర్భాల్లో అడిగేవాడని ఆమె తెలిపింది.2019లో మా బృందం మొత్తం సింగపూర్‌కు వెళ్ళాము.అప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి.
నీకు రాత్రిపూట పార్టనర్ లేకపోతే నా గదికి వచ్చి విస్కీ తాగు అన్నారు.ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను.
ఆ తర్వాత మీరు చాలా అందంగా ఉన్నారు.మిమ్మల్ని చూస్తుంటే గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని ఆయన అన్నారంటూ జెన్నిఫర్ తన బాధను బయట పెట్టేసింది.
జెన్నీఫర్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.