వైరల్: ఈ వీడియో చూసినవారు ఈ జన్మలో ఇక పిచ్చి పనులు చేయరు!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అనేక విషయాలను మనం తెలుసుకోగలుగుతున్నాం.మనలో కొంతమంది ప్రత్యేకంగా కనిపించాలని, మరికొందరు అందరి కంటే తామే గొప్ప అనుకొని, వాటిని నిరూపించుకోవడానికి ఏవేవో సాహసాలు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటుంటారు.

 Swimming Pool Back Flip Stunt Failed Video Viral Details, Boy, Swimming, Latest-TeluguStop.com

ఇలాంటి చర్యలు సోషల్ మీడియా( Social Media ) వచ్చాక బాగా ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు.దానికితోడు ఇటీవల రీల్స్( Reels ) మాయలో పడి చాలామంది పిచ్చి పిచ్చి పనులు చేయడం మొదలు పెట్టారు.

ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి.

ఈ క్రమంలోనే తాజాగా, ఓ బాలుడికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోని చూసినవారు ”ఒక్కసారి ఈ వీడియో చూస్తే.జన్మలో అలాంటి పిచ్చి పనులు చేయరు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.వీడియోని ఒక్కసారి గమనిస్తే, స్విమ్మింగ్ పూల్( Swimming Pool ) వద్ద కొందరు స్నానం చేస్తూ ఉంటారు.

ఆ సమయంలో అక్కడ ఎవరూ ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంటుంది.ఓ బాలుడు ఈత కొట్టేందుకు అక్కడికి వస్తాడు.

వచ్చిన వాడు అందరి మాదిరే ఈత ఆడకుండా ఏదైనా కొత్తగా చేయాలని యత్నిస్తాడు.

ఇక అందరి చూస్తుండగా.”చూడండి నీళ్లలోకి ఎలా దూకుతానో”.అనుకుంటూ వెనక్కు తిరిగి నిలబడతాడు.

కాసేపటి తర్వాత అలాగే ఒక్కసారిగా నీళ్లలోకి వెనక్కు దూకేస్తాడు.కట్ చేస్తే, అదుపు తప్పి స్విమ్మింగ్ పూల్లో కాకుండా పక్కనే సందులో ఇరుక్కుపోతాడు.

ఈ క్రమంలో పాపం అతడికి గాయలవుతాయి.కాగా ఈ ఘటనతో అక్కడే ఉన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అతన్ని కాపాడతారు.

అదృష్టవశాత్తు గాయాలతో( Injuries ) బయటపడతాడు.ఈ ఘటనను వీడియో కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది నెట్టింట తెగ హల్‍చల్ చేస్తోంది.దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.”ఇలాంటి సాహసాలు ఎవరు చేయమన్నారు?” అని కొందరు కామెంట్ చేస్తే, ”లేనిపోని గొప్పలకు పోతే ఇలాగే ఉంటుంది” అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube