కన్నీళ్లు పెట్టుకున్న సురేఖవాణి కూతురు సుప్రీత.. ప్రతి కన్నీటికి విలువ ఉంటుందంటూ?

టాలీవుడ్ ప్రేక్షకులకు యాక్టర్ సురేఖ వాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.యాంకర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.

 Surekha Vani Daughter Suprita Get Emotion And Said Does Every Tear Have Value De-TeluguStop.com

అంతేకానీ అభిమానం సంపాదించుకునే అంత నటిగా మాత్రం ఎదగలేదు.కానీ ప్రస్తుతం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువగా అందాన్ని పరిచయం చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.తన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.నిజానికి ఆమె అందం ఇప్పుడు బయట పడిందనే చెప్పాలి.ఇక ఈమెకు తనెత్తు కూతురు కూడా ఉంది.

ఆమె పేరే సుప్రీత. ఇక సుప్రీత ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం కాలేదు.కానీ సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.ఇక తన తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదు.

నిజానికి ఆమె సురేఖవాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లి లాగా కనిపిస్తుంది.

పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తుంది.

అప్పుడప్పుడు తన ఇన్స్టా వేదికగా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చట్లు పెడుతుంది.తనకు నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు ఊరుకోదు.ఎవరైనా తనను లైవ్ లోనే ఏదైనా మాట అనేస్తే చాలు వెంటనే లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది.

ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి మదిలో గుడి కట్టేసుకుంది కాబట్టి.

ఇక ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఉంటుందని గతంలో చాలా వార్తలు వచ్చాయి.కానీ సురేఖ వాణి మాత్రం ఈ విషయం గురించి స్పందించలేదు.కానీ తనకు ఏది నచ్చితే అదే చేయిస్తానని గతంలో తెలిపింది.ఇక తాజాగా సుప్రీత తన ఇన్ స్టా లో ఒక వీడియో పంచుకుంది.ఆ వీడియోలో తాను సంతోషంగా ఉన్న మూమెంట్ ను, బాగా ఏడుస్తున్న మూమెంట్ ను చూపించింది.

ఇక ఆ వీడియోలో సుప్రీత బాగా ఏడవటంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు.ఇక ఓ నెటిజన్.మీరు ఏడ్చే ఏడుపుకి.

కార్చే కన్నీరుకి ఒక విలువ ఉంది సుప్రీత.విలువ లేని వాళ్లకోసం ఏడ్చి కన్నీళ్లు వేస్ట్ చేయకండి అంటూ కామెంట్ పెట్టారు.

ఇక కొందరు ఏం జరిగింది అంటూ తెగ ప్రశ్నలు వేస్తున్నారు.మొత్తానికి ఆమె వీడియో కంటే ఎక్కువగా ఆ కామెంట్ లే వైరల్ గా మారాయి.

ఇక ఇటీవలే ఈమె రాఖీ జోర్డాన్ తో కలిసి ఓ ప్రైవేట్ ఆల్బమ్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

Surekha vani Daughter Supreetha Emotional Post Viral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube