ఎలక్టోరల్ బాండ్ల కేసులో( Electoral bonds case ) ఎస్బీఐ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.బాండ్ల వివరాలు వెల్లడించేందుకు గడువు పొడిగించాలన్న భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
అయితే రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించే ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు( Supreme Court ) గత నెలలో రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో బాండ్ల జారీని తక్షణమే ఆపేయాలని ఎస్బీఐని ఆదేశించింది.
దాంతోపాటుగా బాండ్ల ద్వారా పార్టీలకు అందిన నగదు, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని కీలక ఆదేశాలు ఇచ్చింది.
అనంతరం సమాచారాన్ని పబ్లిక్ డొమైన్( Public domain ) ద్వారా ఈ నెల 13 లోగా బహిరంగపరచాలని ధర్మాసనం స్పష్టం చేసింది.అయితే తక్కువ సమయంలో ఈసీకి సమాచారం ఇవ్వడం కష్టమన్న ఎస్బీఐ వివరాలను( SBI ) వెల్లడి చేయడానికి జూన్ 30వ తేదీ వరకు గడువు పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎస్బీఐ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను రేపు ఈసీకి( ec ) అందజేయాలని సుప్రీంకోర్టు ఎస్బీఐకి ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా ఈనెల 15 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు బాండ్ల వివరాలను ఈసీ వెబ్ సైట్ లో ఉంచాలని వెల్లడించింది.