CM Jagan Manifesto : ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్న జగన్.. మేనిఫెస్టో ఆలస్యం వెనుక అసలు లెక్క ఇదే!

ఏపీ సీఎం వైఎస్ జగన్( CM Jagan ) 2024 ఎన్నికల్లో గెలుపు కోసం తెలివిగా అడుగులు వేస్తున్నారు.

మేదరమెట్ల జాతీయ రహదారిపై నిర్వహించిన సిద్ధం సభను( Siddham Meeting ) సక్సెస్ చేయడంలో జగన్ సఫలమయ్యారు.

త్వరలో మేనిఫెస్టో( YCP Manifesto ) ప్రకటిస్తామని చెప్పిన జగన్ వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపారు.కొత్త హామీలను టీడీపీ జనసేన బీజేపీ కూటమి కాపీ కొట్టకూడదనే ఆలోచనతోనే జగన్ ఈ దిశగా అడుగులు వేశారని తెలుస్తోంది.2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించిన కొన్ని హామీలను అధికారంలో ఉన్న టీడీపీ ( TDP ) అమలు చేసే దిశగా అడుగులు వేసింది.ఆ తప్పు ఈసారి రిపీట్ కాకూడదని జగన్ భావిస్తున్నారు.

నవరత్నాలలో భాగంగా ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు తోడు కొత్త పథకాలను అమలు చేసే దిశగా జగన్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.వైసీపీపై వ్యతిరేకత ఉందని చంద్రబాబు,( Chandrababu ) పవన్( Pawan Kalyan ) చెబుతున్నా గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి వేరే విధంగా ఉంది.

జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందుకుంటున్న ఓటర్లు మరోసారి వైసీపీని( YCP ) గెలిపించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.రాయలసీమలో వైసీపీకి తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బీజేపీ టీడీపీ జనసేన పొత్తు వల్ల మైనార్టీలు, క్రిస్టియన్ల ఓట్లు సైతం వైసీపీకే పడతాయని ఫలితంగా వైసీపీ ఓటు బ్యాంక్ షేర్ మరో 4 శాతం పెరుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

రైతు రుణమాఫీ ప్రకటిస్తే వైసీపీకే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉండగా వైసీపీ ఈ హామీ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది.2024 ఎన్నికల్లో వైసీపీకి ఆనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా మెజారిటీ సర్వేలలో వైసీపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి.ఈ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉండనుందని తెలుస్తోంది.2024 ఏపీ ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.

మెగాస్టార్ విశ్వంభరలో పవన్ కళ్యాణ్ కనిపిస్తారా.. అలా జరిగితే ఫ్యాన్స్ కు పండగే!
Advertisement

తాజా వార్తలు