AP Cabinet Meeting : రేపు సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం..!!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Elections ) వాడి వేడిగా జరుగుతున్నాయి.మంగళవారం రెండో రోజు సభ మొదలుకాగానే తెలుగుదేశం పార్టీ సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్ సస్పెండ్ చేయడం జరిగింది.

 Ap Cabinet Meeting : రేపు సీఎం జగన్ అధ్యక్�-TeluguStop.com

అనంతరం మంత్రులు పలు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది.రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సీఎం జగన్ ( CM YS Jagan )సుదీర్ఘంగా ప్రసంగించారు.

చంద్రబాబు హయాంలో ప్రజలకు జరిగిన అన్యాయం గురించి వివరించారు.చంద్రబాబు( Chandrababu Naidu ) ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల అనుభవం ఉన్న ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారు అని విమర్శించారు.

కాగా విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఇంకా కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు.


రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతూనే ఉందని చెప్పుకొచ్చారు.ఇంకా కరోనా కారణంగా రెండు ఆర్థిక సంవత్సరాలు తీవ్రంగా నష్టం పోయినట్లు పేర్కొన్నారు.దీంతో ఆదాయం తగ్గినట్లు ఖర్చులు పెరిగినట్లు సీఎం జగన్ తెలియజేశారు.

ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయని అన్నారు.ఇదిలా ఉంటే సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ రేపు సమావేశం కానుంది.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటు ఆమోదం తెలపనుంది.ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్( Finance Ministter Buggana Rajendranath ) అసెంబ్లీలో బడ్జెట్ నీ ప్రవేశపెట్టనున్నారు.

కాగా ఈ నెల 8 వరుకు సమావేశాలు జరగనున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 60 రోజులలో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.సమావేశాలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube