షూటింగ్స్‌ కోసం విదేశాలకు క్యూ కడుతున్న స్టార్స్‌

మొన్నటి వరకు షూటింగ్స్‌ చేయకుండా కరోనాకు భయపడి ఇంటికే పరిమితం అయిన స్టార్స్‌ అంతా కూడా ఇప్పుడు వరుసగా విదేశాలకు వెళ్లి అక్కడ షూటింగ్‌ ముగించేసుకుని వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.ఇండియాలో కరోనా విపరీతంగా ఉంది.

 Star Heros Start The Foriegn Tour Shootings, Mahesh Babu, Amirkhan, Nithing, Ran-TeluguStop.com

ఈ సమయంలో ఇక్కడ షూటింగ్‌ చేయడం అంటే ఖచ్చితంగా కరోనాతో ఆడుకోవడమే అవుతుంది.అందుకే ఎలాంటి ఛాన్స్‌ తీసుకోకుండా ఏదేశంలో అయితే తక్కువగా కరోనా ప్రభావం ఉందో అక్కడకు వెళ్లి షూటింగ్స్‌ చేసుకోవాలని చూస్తున్నారు.

కొన్ని వారాల క్రితం అమీర్‌ ఖాన్‌ తన సినిమా షూటింగ్‌ కోసం యూరప్‌ వెళ్లిన విషయం తెల్సిందే.అక్కడ స్పీడ్‌ గా చిత్రీకరణ జరుపుతున్నారు.ఇండియాలో చేయాలనుకున్న సీన్స్‌ను కూడా అక్కడే ముగించేసుకుని రావాలని నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లతో వాళ్లు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఇక ఆమద్య నితిన్‌ రంగ్‌ దే యూనిట్‌ సభ్యులు కూడా విదేశాలకు బ్యాలన్స్‌ చిత్రీకరణ ముగించేందుకు వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

Telugu Amirkhan, Foriegn, Mahesh Babu, Nithin, Rang De-

ఇప్పుడు మహేష్‌బాబు సినిమా చిత్రీకణ అంటున్నారు.ఇలా స్టార్‌ హీరోల సినిమాలు చిత్రీకరణ ముగించేందుకు విదేశాలను ఎంపిక చేసుకుంటున్నారు.కొన్ని దేశాల్లో కరోనా అతి తక్కువగా ఉంది.

కనుక ఎలాంటి ఆందోళన లేకుండా అక్కడ షూటింగ్స్‌ చేసుకోవచ్చు.అయితే అక్కడ కొన్ని రోజుల పాటు మొదట క్వారెంటైన్‌లో ఉండాల్సి రావచ్చు.

అది కాకుండా అన్ని విధాలుగా బెటర్‌గా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇండియాలో కరోనా అదుపులోకి రావాలంటే వ్యాక్సిన్‌ రావాల్సిందే.

అది ఎప్పుడు అయ్యేనో తెలియదు.కనుక విదేశాల్లో షూటింగ్‌ చేయడం ఉత్తమం అని అంతా అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube