ముద్దు పెట్టడం ఇంతేనా అంటూ రష్మిక షాకింగ్ కామెంట్స్.. మీకు తెలీదా అంటూ?

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఈ బ్యూటీ భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు కెరీర్ గ్రాఫ్ పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఆఫ్ స్కీన్ పై గ్లామర్ గా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఆన్ స్క్రీన్ లో మాత్రం అభినయ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.పుష్ప2 సినిమా ( Pushpa 2 movie )నుంచి విడుదలైన శ్రీవల్లి ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 Star Heroine Rashmika Shared Photo Goes Viral In Social Media Details Here , Sta-TeluguStop.com

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉండగా ఈ బ్యూటీ చేసే పోస్ట్ లు తెగ వైరల్ అవుతుంటాయి.వారసుడు సినిమా( Varasudu Movie )లో రష్మిక పాత్రకు మంచి పేరు రాకపోయినా ఈ సినిమా కమర్షియల్ గా మంచి పేరును సొంతం చేసుకుంది.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న రష్మిక ఈ సినిమాలతో కూడా మంచి ఫలితాలను అందుకుంటానని నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda )తో ప్రేమలో ఉన్నట్టు రష్మిక గురించి తరచూ వార్తలు వైరల్ అవుతుండగా ఆ వార్తల్లో నిజం లేదనే విధంగా ఈ బ్యూటీ స్పందిస్తున్నారు.తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో “నాకు లిప్స్ తో గుచ్చడం రాదని కిస్ చేసే విధానం ఇదేనా” అని ప్రశ్నిస్తూ ఒక ఫోటోను షేర్ చేశారు.అయితే రష్మిక ప్రశ్నకు ముద్దు పెట్టడం ఎలాగో మీకు తెలీదా అంటూ నెటిజన్లు రివర్స్ లో కౌంటర్లు ఇస్తున్నారు.

మరి కొందరు నెటిజన్లు రష్మిక గీతా గోవిందం సినిమాను ( Geetha Govindam movie )చూస్తే ముద్దు పెట్టడం ఎలాగో తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు.గీతా గోవిందం సినిమాలో లిప్ లాక్స్ ద్వారా ఈ బ్యూటీ గతంలో వార్తల్లో నిలిచారు.హీరోయిన్ రష్మిక పుష్ప2 సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube