పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన ఆవిర్భావ సభలో చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చబోనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశారు.అయితే వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా పవన్ పై షాకింగ్ కామెంట్లు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే శ్రీరెడ్డికి ఎంతో అభిమానం అనే సంగతి తెలిసిందే.వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి పలు సందర్భాల్లో శ్రీరెడ్డి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.
పవన్ కళ్యాణ్ ను తాను ఒకే విషయం అడుగుతున్నానని జనసేన 9వ ఆవిర్భావ సభ అని పవన్ చెప్పాడని గత తొమ్మిదేళ్లలో పవన్ చేసిన ధర్నాలు, సేవలు ఏమిటని శ్రీరెడ్డి ప్రశ్నించారు.పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ కు అర్థమైనదేమిటని శ్రీరెడ్డి అడిగారు.
పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ చదివారని ఆ స్క్రిప్ట్ లోని ప్రశ్నలు అడిగితే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పలేరని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.పవన్ కు చెప్పడం చేతకాదని పవన్ గుండెల్లో భయం ఉందని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.
పవన్ కు గుండెదడ ఎలా కొట్టుకుంటుందో తనకు తెలుసని శ్రీరెడ్డి కామెంట్లు చేశారు.పవన్ కళ్లలో తాను భయం చూశానని శ్రీరెడ్డి వెల్లడించారు.
![Telugu Pawan Kalyan, Sensational, Sri-Movie Telugu Pawan Kalyan, Sensational, Sri-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/03/pawan-kalyan-sensational-comments-srireddy.jpg )
పవన్ కు ధైర్యం లేదని జగన్ ను అనడానికి పవన్ ధైర్యం కొనుక్కొని తెచ్చుకున్నారని శ్రీరెడ్డి వెల్లడించారు.రాజకీయాలను మారుస్తానని పవన్ చెబుతున్నాడని పవన్ ఏం మారుస్తాడని శ్రీరెడ్డి ప్రశ్నించారు.శ్రీరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.