టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శ్రీకాంత్.హీరోగా ఎక్కువగా లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన శ్రీకాంత్ కెరియర్ లో మంచి సక్సెస్ రేట్ ఉంది.
ఎక్కువ మంది దర్శకులు మినిమం గ్యారెంటీ హీరోగా శ్రీకాంత్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు.అయితే ఈ మధ్య కాలంలో హీరోగా శ్రీకాంత్ కెరియర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.
ఆడియన్స్ కొత్తదనం కోరుకుంటూ ఉండటంతో, శ్రీకాంత్ నటుడుగా విభిన్నంగా మార్చుకోలేక హీరోగా రొటీన్ యాక్టింగ్ తో క్రేజ్ పోగొట్టుకున్నాడు.దీంతో అతను హీరోగా చేసే సినిమాలకి కనీసం ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.
ఈ నేపధ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న శ్రీకాంత్ ఇప్పుడు విలన్ గా కూడా మెప్పించడానికి రెడీ అవుతున్నాడు.ఇప్పటికే యుద్ధం శరణం అనే సినిమాలో చైతూకి విలన్ గా నటించిన అది మెప్పించలేదు.
అయితే ఈ సారి బోయపాటి శ్రీకాంత్ కి విలన్ గా ఆఫర్ ఇచ్చాడు.అది కూడా బాలయ్య సినిమాలో.జగపతిబాబుని పవర్ ఫుల్ విలన్ గా పరిచయం చేసిన బోయపాటి ఇప్పుడు శ్రీకాంత్ ని మరింత పవర్ ఫుల్ గా ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.నెరసిన గెడ్డం, మీసాలతో, డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో చాలా స్టైలీష్ గా ఈ సినిమాలో శ్రీకాంత్ కనిపించనున్నాడని అంటున్నారు.
బోయపాటి చాలా కొత్తగా శ్రీకాంత్ పాత్రను డిజైన్ చేశాడనీ, ఈ పాత్ర మాస్ ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు.ఇక విలన్ గా బిజీ అవ్వాలని అనుకుంటున్న శ్రీకాంత్ కి బోయపాటి సినిమా కచ్చితంగా టర్నింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.
.