భారత్ పై విషం కక్కిన పాక్ జర్నలిస్ట్ కి మద్దతు ఇచ్చిన నగ్మా

స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి నగ్మా.రెండు దశాబ్దాల క్రితం తెలుగులో అగ్ర హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న నగ్మా బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది.

 Netizens Serious On Congress Women Leader Nagma, Tollywood, Indian Politics, Con-TeluguStop.com

తరువాత అప్పుడప్పుడు సినిమాలలో మెరిసిన ఈ ముదురు భామ పూర్తిగా సినిమాలు పక్కన పెట్టి రాజకీయాలలో బిజీ అయిపొయింది.కాంగ్రెస్ పార్టీలో చేరి పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలిగా కొనసాగుతుంది.

వీలైన ప్రతిసారి మోడీని, బీజేపీని తిడుతూ కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసే నగ్మా తాజాగా ఓ విషయంలో సోషల్ మీడియాలో నెటిజన్లుకి టార్గెట్ అయ్యింది.పాకిస్తాన్ జర్నలిస్ట్ భారత్ పై ద్వేషపూరితం విషం కక్కుతూ ఉంటే అతనిని సమర్ధిస్తూ మాట్లాడి ఇప్పుడు అందరితో చివాట్లు తింటుంది.

మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు పేరిట ఒక హిందీ టీవీ ఛానెల్ రెండు రోజుల క్రితం చర్చా కార్యక్రమం నిర్వహించింది.ఈ చర్చా కార్యక్రమంలో నగ్మా, పాక్ జర్నలిస్టు తరీఖ్ పీర్జాదా పాల్గొన్నారు.

పాక్ ను పొగుడుతూ భారత్ ను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు శ్రుతి మించడంతో సదరు ఛానెల్ వ్యాఖ్యాత అడ్డుతగిలారు.అయితే భారత్ పై విషం కక్కుతూ వ్యాఖ్యలు చేసిన పీర్జాదాను ఆపినందుకు వ్యాఖ్యాతపై నగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ జర్నలిస్ట్ ను కించపరిచేందుకే ఈ చర్చా కార్యక్రమం నిర్వహించారా అంటూ ఆ వ్యాఖ్యాతను ప్రశ్నించారు.చర్చా కార్యక్రమం అనంతరం పాక్ జర్నలిస్ట్ కు మద్దతుగా ఆమె ఓ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ను చూసిన నెటిజన్లు నగ్మాపై విరుచుకుపడుతున్నారు.దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక జర్నలిస్ట్ కి మద్దతుగా నగ్మా ఎలా మాట్లాడుతుందని, అసలు దేశం అంటే గౌరవం లేని నీలాంటి వాళ్ళ వల్లకాంగ్రెస్ పార్టీ మీద ఉన్న గౌరవం కూడా చాలా మందికి పోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube