ఈరోజు (20/07/2022) “అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ (ఎ.సి.ఎఫ్)” వెబ్సైట్ ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా “ఎ.సి.ఎఫ్” వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజపాలెం శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మంత్రి గారి చేతులమీదుగా వెబ్సైట్ ఆవిష్కరణకు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి సహకరించిన లడ్డు, సయ్యద్ గార్లకు కృతఘ్నత లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు యర్రా శ్రీనివాస్, కసపు గోవిందు, మహేష్ (నల్గొండ), రాజేష్, మహేష్ (భువనగిరి), ప్రవరాఖ్య, సాయి, ఆది నాయక్, బాబ్జీ పాల్గొన్నారు.
తాజా వార్తలు