ప్రముఖ కోలీవుడ్ నటుడు ఉదయనిది స్టాలిన్( Udaya Nidhi Stalin ) కీర్తి సురేష్ ( Keerthy Suresh ) ప్రధానపాత్రలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మామన్నన్ ( Maamannan ).మారి సెల్వరాజ్ ( Mari Selvaraj) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తమిళంలో ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.
ఈ విధంగా తమిళంలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ‘నాయకుడు’ ( Naayakudu ) పేరుతో తెలుగులో తాజాగా విడుదల చేశారు.ఇక్కడ కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే నటి కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ఈ సినిమా తమిళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇందులో ఒక ఎమోషన్ పాయింట్ ఉంది.ఆఎమోషన్ పాయింట్ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని కీర్తి సురేష్ తెలిపారు.ఇక డైరెక్టర్ మారి సెల్వరాజ్ గారితో పని చేయాలని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటారు ఎందుకంటే ఆయన సినిమాలో హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఆయన కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ గా అనిపించేది కానీ సినిమా చేసేటప్పుడు అందుకు నాలుగు రెట్లు ఎక్కువ ఎక్సైట్మెంట్ కలిగిందని కీర్తి సురేష్ తెలిపారు.
చిన్నగా మొదలైన ఓ గొడవ అది ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే విషయాన్ని డైరెక్టర్ చాలా బాగా చూపించారని కీర్తి సురేష్ తెలిపారు.ఈ సినిమా కోసం నాకు ముందుగా లుక్ టెస్ట్ చేయలేదు షూటింగ్ గంటకు ప్రారంభం అవుతుంది అనగా తనకు లుక్ టెస్ట్ చేశారని తెలిపారు.ఇక ఈ సినిమాలో మీరు కనుక గమనిస్తే ఉదయ్ గారిది నాది ఒకే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది.
నాకు వేసుకోవడానికి షర్ట్ లేకపోతే మీ షర్ట్ వేసుకోవచ్చా అంటూ హీరోని అడిగానని ఈ సందర్భంగా కీర్తి సురేష్ తెలిపారు.ఇక చాలామంది మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుందని తనకు చెప్పారు అంటూ ఈ సందర్భంగా కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.