సమ్మర్‌ వెకేషన్.. ఈసారి ఆగ్నేయాసియా దేశాలకు భారతీయుల క్యూ : ఓయో సర్వే

వేసవి వచ్చిందంటే చాలు చిన్నా, పెద్దా ఏదైనా వెకేషన్‌కు ( Vacation ) వెళ్తుంటారు.ఏడాది మొత్తం చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇతర పనులతో బిజీగా ఉండే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేసి కాస్త రిలాక్స్ అవ్వాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు.

 Southeast Asian Nations Top Choice For Indians Travelling Abroad This Summer Sur-TeluguStop.com

కొందరు మనదేశంలోని ఆలయాలకు తీర్ధయాత్రలు, ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తే.మరికొందరు మాత్రం విదేశాలకు వెళ్తుంటారు.

అయితే భారతీయులు( Indians ) ఇటీవలికాలంలో ఆగ్నేయాసియా దేశాలకు ఎక్కువగా వెళ్తున్నారట.‘‘ OYO Global Summer Vacations Travelopedia 2024 ’’ నిర్వహించిన సర్వే ప్రకారం .వీసా సడలింపులు, సుదీర్ఘ వారాంతాలు, సెలవులను ఎక్కువగా వినియోగించుకుంటూ 5-7 రోజుల టూర్ నిమిత్తం ఈ దేశాలే భారతీయుల ప్రాధాన్యతగా ఉన్నాయట.

దాదాపు 4 వేల మంది పర్యాటకుల అభిప్రాయాలను విశ్లేషించి ఈ నివేదికను వెలువరించారు.38 శాతం మంది బాలికి( Bali ) అనుకూలంగా ఓటు వేయడంతో అది టాప్ ప్లేస్‌లో నిలిచింది.పట్టాయా, బ్యాంకాక్, దుబాయ్‌లు దానికి దగ్గరగా వచ్చాయి.ఇండోనేషియా, మలేషియా వంటి ఆగ్నేయాసియా గమ్యస్థానాలు సడలించిన వీసా నిబంధనలను అనుసరించి ప్రాధాన్య దేశాలుగా మారాయని ఓయో( Oyo ) తెలిపింది.10-15 రోజులు అంతకంటే ఎక్కువ కాలం గడిపేందుకు ఇష్టపడే సుదూర ప్రాంతాల్లో యూరప్, అమెరికాలు టాప్ ప్లేస్‌లో నిలిచాయి.

Telugu Bali, Bangkok, Dubai, Indian, Indians, Malaysia, Oyoceo, Oyo, Southeast A

ఓయో వ్యవస్థాపకుడు , సీఈవో రితేష్ అగర్వాల్( CEO Ritesh Agarwal ) మాట్లాడుతూ.మెరుగైన ఫ్లైట్ కనెక్టివిటీ, వీసా సౌకర్యం, అనేక రకాల ప్రయాణ ఎంపికలతో ఆగ్నేయాసియా అందాలను అన్వేషించడం భారతీయ ప్రయాణీకులకు గతంలో కంటే మరింత సౌకర్యవంతంగా మారిందన్నారు.ఈ ప్రాంతంలోని ప్రీమియం ప్రాపర్టీలు భారతీయ పర్యాటకులకు ఎంపికగా మారాయి.‘‘ ట్రావెలోపీడియా 2024 ’’ అనేది వేసవి సెలవుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకుల ప్రయాణ ప్రాధాన్యతలను, ట్రెండ్‌లను ప్రస్తావించే వార్షిక నివేదిక.

Telugu Bali, Bangkok, Dubai, Indian, Indians, Malaysia, Oyoceo, Oyo, Southeast A

భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి మే 30 వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను పేర్కొన్నారు.మలేషియా, ఇండోనేషియా వంటి అనేక ఆగ్నేయాసియా దేశాలు ఇటీవల భారత పర్యాటకుల కోసం వీసా నిబంధనలను సడలించడంతో ఈ ప్రాంతంలోని ప్రఖ్యాత గమ్యస్థానాలకు సందర్శకుల తాకిడి పెరిగింది.భారత్ – గల్ఫ్ ప్రాంతాల మధ్య ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి దుబాయ్ ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను రూపొందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube