ఇలా అయితే అల వైకుంఠపురములో అట్టర్ ఫ్లాప్ ఖాయం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

 Siva Karthikeyan, Ala Vaikunthapuramuloo, Allu Arjun, Trivikram, Pooja Hegde-TeluguStop.com

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.

ఈ సినిమా సాధించిన భారీ సక్సెస్‌తో ఇతర భాషల దర్శకనిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చకచకా జరుగుతున్నాయి.ఇక ఈ సినిమాలో యంగ్ హీరో శివ కార్తికేయన్ బన్నీ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న తమిళ తంబీలు చాలా నిరాశకు లోనయ్యారట.శివ కార్తికేయన్ ఫాంలో లేకపోవడం, వరుసగా ఫ్లాప్ చిత్రాలను తెరకెక్కిస్తుండటంతో, ఇప్పుడు ఇలాంటి బిగ్గెస్ట్ హిట్ మూవీలో ఎందుకు నటిస్తున్నాడా అని వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

శివ కార్తికేయన్ కాకుండా ఈ సినిమాను వేరే స్టార్ హీరోతో చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు అంటున్నారు.గతంలోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని తమిళంలో శింబు నటించగా అది అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube