ప్రస్తుతం ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.ఈ షో చివరి దశకు చేరుకుంది.
ఇక ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్స్ తో గ్రాండ్ ఫినాలే విజేత ఎవరు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.అయితే తెలుగు ఇండియన్ ఐడల్ షో విజేతగా ఎవరు నిలుస్తారు అని కంటెస్టెంట్ లతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ షో విన్నర్ గా నెల్లూరుకు చెందిన వాగ్దేవి విజేతగా నిలిచింది.ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది.
గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
అలాగే సాయి పల్లవి, రానా కూడా స్పెషల్ గిఫ్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.
కాగా ఈ షోకి సింగర్ శ్రీరామ్ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, తమన్, నిత్యా మీనన్,సింగర్ కార్తీక్ లు జడ్జీలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ షోలో మొత్తం 12 మంది కంటెస్టెంట్ లు కాగా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కేవలం ఐదుగురు మాత్రమే చేరుకున్నారు.
వీరిలో గ్రాండ్ ఫినాలే లో స్ట్రాంగ్ పర్ఫామెన్స్ తో వాగ్దేవి టైటిల్ ను గెలుచుకుంది.మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా వాగ్దేవి ట్రోఫీని అందుకుంది.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా కూతురు ట్రోఫీ అందుకోవడానికి చూసిన వాగ్దేవి తండ్రి చిరంజీవి గారికి నెల్లూరు కి మంచి అనుబంధం ఉంది అటువంటి ఆయన చేతులమీదుగా ట్రోపి అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.అనంతరం విన్నర్ వాగ్దేవి మాట్లాడుతూ.తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి తనను ఎంతోమంది ప్రోత్సహించారని, ఒక సింగర్ గా తనకు ఏ ఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక పాట పాడాలని ఉందని, అదేవిధంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి దగ్గర కోరస్ టీమ్ లో పాడిన కూడా అదృష్టంగా భావిస్తాను అని చెప్పుకొచ్చింది వాగ్దేవి.తనను ఒక సింగర్ గా చూడాలని తల్లి కోరిక అని, తనకు వచ్చిన ఆ ట్రోఫీని తన తల్లికి అంకితం ఇస్తున్నాను అని చెప్పుకొచ్చింది వాగ్దేవి.