రెమ్యునరేషన్ పై గీతామాధురి షాకింగ్ కామెంట్స్.. డిమాండ్ చేస్తే తట్టుకోలేరంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ సిన్గర్లలో గీతామాధురి కూడా ఒకరనే సంగతి తెలిసిందే.నచ్చావులే సినిమాలోని నిన్నే నిన్నే కోరా పాటతో ప్రశంసలతో పాటు నంది అవార్డును సైతం గీతామాధురి అందుకున్నారు.

 Singer Geetha Madhuri Shocking Comments About Remuneration Details, Geetha Madhu-TeluguStop.com

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో గీతామాధురి చదువుకున్నారు.ప్రేమలేఖరాశా అనే సినిమాలోని ఒక పాట ద్వారా ఆమె సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.2014 సంవత్సరంలో గీతామాధురి నందుల వివాహం ఘనంగా జరిగింది.

ఒక షార్ట్ ఫిల్మ్ లో కలిసి నటించే సమయంలో గీతామాధురి, నందు మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

చిరుత, ఏక్ నిరంజన్, గుడ్ మార్నింగ్ సినిమాలు సింగర్ గా గీతా మాధురికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.ఇటీవల విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకున్న జై బాలయ్య పాటను పాడిన సింగర్లలో గీతామాధురి కూడా ఒకరు.

ఈ పాటకు తీసుకున్న రెమ్యునరేషన్ గురించి గీతామాధురి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తను పాడే పాటలలో కొన్ని హిట్ అవుతాయని కొన్ని మాత్రం హిట్ కావని గీతామాధురి తెలిపారు.

Telugu Akhanda, Geeta Madhuri, Geetha Madhuri, Geethamadhuri, Jai Balayya, Nandu

అయితే పాడిన పాటకు రెమ్యునరేషన్ కు సంబంధించి ఎంత కావాలో డిమాండ్ చేయలేదని గీతామాధురి చెప్పుకొచ్చారు.ఒకవేళ పాటల కోసం రెమ్యునరేషన్ ను తాను డిమాండ్ చేస్తే అస్సలు తట్టుకోలేరని గీతామాధురి కామెంట్లు చేశారు.ఒకవేళ తాను డిమాండ్ చేస్తే నువ్వు కూడా అడుగుతున్నావా? అని అంటారని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Akhanda, Geeta Madhuri, Geetha Madhuri, Geethamadhuri, Jai Balayya, Nandu

థమన్ గారు ఏ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలో ఫిక్స్ చేస్తారని గీతామాధురి వెల్లడించారు.తన రెమ్యునరేషన్ ఎంతో చెప్పకపోయినా గీతామాధురి రెమ్యునరేషన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.వరుసగా హిట్ సాంగ్స్ పాడుతూ గీతామాధురి వార్తల్లో నిలుస్తున్నారు.

నందమూరి హీరోల సినిమాలకు సింగర్ గీతామాధురి పాడిన పాటలు హిట్టవుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube