ఆకాష్ కి అత్తగా వెటరన్ స్టార్ హీరోయిన్... రొమాంటిక్ కిక్ ఇచ్చే న్యూస్

పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ ని హీరోగా నిలబెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.తనని కమర్షియల్ హీరోగా టాలీవుడ్ లో ప్రోజక్ట్ చేయడానికి ఇప్పటికే మెహబూబా అనే సినిమాని తెరకెక్కించాడు.

 Simran Play Negative Role In Romantic Movie, Tollywood, Aakash Puri, Ketika Shar-TeluguStop.com

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.అయితే ఈ సారి కొడుకు కోసం లవ్ స్టొరీని సిద్ధం చేసి దానిని తన అసిస్టెంట్ అనిల్ చేతిలో పెట్టాడు.

రొమాంటిక్ టైటిల్ తో పూరి స్టైల్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది.రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.సినిమా మెజారిటీ షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.

అన్ని అనుకూలంగా జరిగి ఉంటే ఇప్పటికే సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యేది.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో హీరో ఆకాష్ కి అత్త ఉంటుందని, అదే సినిమాలో నెగిటివ్ రోల్ అని చెప్పుకుంటున్నారు.ఇక ఈ అత్త పాత్ర కోసం వెటరన్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ని పూరి టీం రంగంలోకి దించినట్లు సమాచారం.

సిమ్రాన్ ఈ చిత్రంలో హీరోయిన్ కేతిక శర్మకి తల్లిగా నటిస్తోంది.ఇక హీరో, అత్త పాత్రల మధ్య మంచి ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు ఉంటాయాని కూడా చెప్పుకుంటున్నారు.ఇప్పటికే ఈ సినిమాలో ఆమెకి సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని, అయితే సిమ్రాన్ రోల్ గురించి సీక్రెట్ గా ఉంచాలని పూరి టీం భావించడంతో ఇన్ని రోజులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం.ఇప్పటికే తమిళ సినిమాలో పవర్ ఫుల్ నెగిటివ్ రోల్ లో మెప్పించిన సిమ్రాన్ ఈ సినిమాలో ఏ స్థాయిలో కనిపిస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube