మంచు విష్ణు, మంచు మనోజ్( Manchu Vishnu, Manchu Manoj ) మధ్య గ్యాప్ ఉందని ఈ మధ్య కాలంలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి ప్రచారంలోకి వచ్చాయి.మంచు విష్ణు గురించి అడిగితే మనోజ్ సైతం ఒకింత వెటకారంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా మనోజ్ భార్యకు ప్రేమతో కానుక అంటూ ఒక వీడియోను షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.అయితే ఈ వీడియోలో మంచు విష్ణు ఒకే ఒక్క ఫ్రేమ్ లో కనిపించారు.
ఈ విధంగా చేయడం ద్వారా మంచు విష్ణుతో తనకు విభేదాలు ఉన్నాయని మంచు మనోజ్ చెప్పకనే చెప్పేశారు.అయితే వీళ్లిద్దరి మధ్య గొడవలకు కారణమేంటనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
మంచు ఫ్యామిలీ( Manchu Family ) గొడవలకు సంబంధించి సోషల్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి రావడం గమనార్హం.మొత్తం వీడియోలో విష్ణు, మనోజ్ పక్కపక్కనే కనిపించలేదు.
రోజురోజుకు వీళ్లిద్దరి మధ్య గ్యాప్ మరింత పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు మంచు మనోజ్ అమ్మ, అక్కకు రుణపడిపోయానని చెప్పుకొచ్చారు.జీవితాంతం వాళ్లకు ఎలాంటి బాధ కలగకుండా చూసుకోవాలని మనోజ్ కామెంట్లు చేశారు.అమ్మ, అక్క తన పెళ్లికి సంబంధించి ఎంతో నలిగిపోయారని మనోజ్ అభిప్రాయపడ్డారు.ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పెళ్లి చేసుకున్నానని ఆయన అన్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు వీడియోలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడం ఆయన ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.గత సినిమాల ఫలితాలు విష్ణుకు భారీ షాకిచ్చాయనే సంగతి తెలిసిందే.విష్ణు, మనోజ్ కలిసి సినిమాల్లో నటించే ఛాన్స్ కూడా లేదని తెలుస్తోంది.
అయితే మనోజ్, విష్ణు బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకూడదని మోహన్ బాబు సూచనలు చేసినట్టు సమాచారం.రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.