Chiranjeevi Rajinikanth : రజనీకాంత్, చిరంజీవిలకు జరిగిన ఈ అవమానాల గురించి మీకు తెలుసా?

రజనీకాంత్, చిరంజీవి ప్రస్తుతం కనుసైగతో టాలీవుడ్ ఇండస్ట్రీని శాసించే అతికొద్ది మంది నటులు అనే సంగతి తెలిసిందే.సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి వచ్చి సంచలనాలు సృష్టించిన ఈ నటులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

 Shocking Facts About Chiranjeevi Rajanikanth Career Troubles Details Here , Sh-TeluguStop.com

అయితే రజనీకాంత్, చిరంజీవిలకు జరిగిన అవమానాల గురించి చాలామందికి తెలియదు.

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు జీవీ నారాయణ రావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నాకు ఆఫ్ బీట్ సినిమాలు అంటే ఎక్కువ ఆసక్తి ఉండేదని ఆయన కామెంట్లు చేశారు.ఒక ఊరి కథ సినిమా నాకు చాలా మంచి పేరు వచ్చిందని నారాయణ రావు తెలిపారు.

ఆర్ట్ సినిమాలలో నేను ఎక్కువగా నటించానని ఆయన పేర్కొన్నారు.నేను నిర్మాతగా చేసిన సినిమాలు కూడా ఎక్కువగా సక్సెస్ సాధించాయని నారాయణరావు తెలిపారు.

సుధాకర్ కు భారతీరాజా వేషం ఇచ్చారని చిరంజీవికి ఇవ్వలేదని ఆయన అన్నారు.రజనీకాంత్, నేను ఆఫీసులకు వెళ్లామని నాకు ఛాన్స్ లు ఇచ్చి రజనీకాంత్ కు ఛాన్స్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయని నారాయణ రావు తెలిపారు.

అలాంటి అవమానాలు జరిగిన చిరంజీవి, రజనీకాంత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసని ఆయన చెప్పుకొచ్చారు.రజనీకాంత్ విలన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చారని నారాయణరావు పేర్కొన్నారు.

Telugu Chiranjeevi, Gv Yana Rao, Jailer, Rajanikanth-Movie

చిరంజీవి గారికి ఫైట్స్, డ్యాన్స్ అంటే ఇష్టమని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవి, రజనీకాంత్ 65 సంవత్సరాల వయస్సు దాటినా వరుస ఆఫర్లతో బిజీ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తుండగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తున్నారు.ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.వాల్తేరు వీరయ్య సినిమా రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube