అవతార్2 మూవీకి భారతీయ పురాణాలకు లింక్ ఇదే.. ఈ సీన్లను గమనించారా?

ఈరోజు థియేటర్లలో విడుదలైన అవతార్2 సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.నిడివి విషయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా అభిమానులకు మాత్రం ఈ సినిమా ఎంతో నచ్చుతోంది.

 Shocking Facts About Avatar 2 Movie Details Here Goes Viral,avatar 2,avatar,hin-TeluguStop.com

విజువల్ వండర్ గా పేరు తెచ్చుకున్న అవతార్2 సినిమాకు పైరసీ వల్ల పెద్దగా నష్టం కలగదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే అవతార్2 సినిమాలోని కొన్ని సీన్లకు భారతీయ పురాణాలకు లింక్ ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.రామాయణంలో రాముడు లంకపై విజయం సాధించడం కోసం వానరుల సహాయం తీసుకున్న సంగతి తెలిసిందే.అవతార్2 మూవీ విషయానికి వస్తే భూలోకవాసులపైన విజయం సాధించడం కొరకు జేక్ సల్లీ జలవాసుల సహాయం తీసుకున్నారు.పాండవులు విరాటరాజు కొలువులో దాక్కున్న విధంగా అవతార్2 సినిమాలో హీరో ఫ్యామిలీ జలవాసుల వద్ద తల దాచుకోవడం గమనార్హం.

హిరణ్యకశపుడు ప్రహ్లాదుడు తరహా సన్నివేశం కూడా అవతార్2 సినిమాలో ఉంది.జేమ్స్ కామెరున్ భారతీయ పురాణాలపై అవగాహనను కలిగి ఉన్నాడని సినిమాలోని చాలా సన్నివేశాలకు భారతీయ పురాణాలు స్పూర్తి అని అని కామెంట్లు వినిపిస్తున్నాయి.అవతార్2 మూవీ కలెక్షన్లు సైతం ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు కలెక్షన్లు 20 కోట్ల రూపాయలకు పైగా ఉండబోతున్నాయని సమాచారం.

అవతార్2 మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వచ్చే వారం థియేటర్లలో రిలీజవుతున్న సినిమాల నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నారు.అవతార్2 సినిమా 16000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.అవతార్1 ను మించి ఈ సినిమా ఉందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube