15 ఏళ్ల క్రితం ప్రభాస్ కు అంత పెద్ద ప్రమాదం జరిగిందా.. దేవుడే కాపాడాడంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas )తన సినీ కెరీర్ లో ఎన్నో రిస్కీ సన్నివేశాల్లో నటించారు.బాహుబలి, బాహుబలి2( Bhahubali,Bhahubali2 ) సినిమాల కోసం ప్రభాస్ పడిన కష్టం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేననే సంగతి తెలిసిందే.

 Shocking Facts Abot Prabhas Cine Career Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఈ రెండు సినిమాలలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి.అయితే ప్రభాస్ కెరీర్ లో కొన్ని సినిమాలు అద్భుతంగా ఉన్నా ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

Telugu Bujjigadu, Prabhas, Prabhas Latest, Sanjana, Sanjanaprabhas-Movie

స్టార్ హీరో ప్రభాస్ సినీ కెరీర్ లోని అండర్ రేటెడ్ సినిమాలలో బుజ్జిగాడు( Bujjigadu movie ) సినిమా ఒకటి.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, సంజన గల్రానీ హీరోయిన్లుగా నటించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజన ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.బుజ్జిగాడు మూవీ పేరు వినగానే నాకు స్టార్ హీరో ప్రభాస్ గుర్తొస్తాడని ఆమె అన్నారు.

ప్రభాస్ చాలా తక్కువగా మాట్లాడతారని అయినప్పటికీ ఆయన ఎంతో యాక్టివ్ అని సంజన అన్నారు.

Telugu Bujjigadu, Prabhas, Prabhas Latest, Sanjana, Sanjanaprabhas-Movie

బుజ్జిగాడు మూవీ షూటింగ్ సమయంలో భయపెట్టే ఘటన చోటు చేసుకుందని సంజన చెప్పుకొచ్చారు. ఒక షాట్ లో ప్రభాస్ బస్సు నుంచి కింద పడ్డారని ఆ సమయంలో బస్సు ప్రభాస్ పై నుంచి వెళ్లిందని సంజన అన్నారు.ప్రభాస్ మధ్యలో ఉండటంతో ఆయనకు ఏం కాలేదని ఆ విధంగా స్టార్ హీరో ప్రభాస్ కు ఘోర ప్రమాదం తప్పిందని ఆమె చెప్పుకొచ్చారు.

బుజ్జిగాడు సినిమా విడుదలై 15 సంవత్సరాలు అయిన సందర్భంలో సంజన మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.దేవుని దయ వల్లే ప్రభాస్ కు ఏమీ కాలేదని సంజన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తన సినీ కెరీర్ లో ప్రభాస్ రిస్కీ షాట్స్ లో నటించినా ఆ విషయాల గురించి చెప్పుకోవడానికి మాత్రం ఆయన అస్సలు ఇష్టపడలేదనే సంగతి తెలిసిందే.మరో మూడు వారాల్లో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube