పర్సనల్ లోన్ తీసుకుంటున్నట్లైతే ముఖ్యంగా ఈ తప్పులు చేయొద్దు!

డబ్బులతో ఎవరికి అవసరం ఉండదు? డబ్బుకోసం చాలా మంది బ్యాంకులు( Banks ) లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి పర్సనల్ లోన్ తీసుకుంటూ ఉంటారు.ఇలా పర్సనల్ లోన్( Personal Loan ) తీసుకోవాలని అనుకునేవారు ఆ రుణం మొదట ఎందుకు తీసుకోవాలో ఆలోచించుకోవాలి.

 Dont Make These Mistakes While Taking Personal Loan Details, Personal Loan, Tips-TeluguStop.com

దాని అవసరం ఎంతవరకో బేరేజి వేసుకోవాలి.ఎందుకంటే కొన్ని అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సనల్ లోన్ తీసుకోకపోవడం ఉత్తమం.

ఇక ఎట్టి పరిస్థితులలోను మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి.

Telugu Products, Interest Rates, Incomes, Latest, Personal Loan, Tips-Latest New

పర్సలోన్ ద్వారా లగ్జరీ ప్రొడక్టుకు వంటివి అస్సలు కొనుగోలు చేయవద్దు.ట్రావెల్ ( Travel ) చేయడానికి కూడా లోన్ తీసుకోవడం తెలివైన నిర్ణయం కాదు.ఎందుకంటే ప్రొడక్టులు కొంటే వాటి విలువ తగ్గుతూ వస్తుంది.

కానీ మీరు లోన్ మాత్రం కడుతూనే ఉండాలి.ఇంకా లోన్ ద్వారా విదేశాలకు టూర్ వెళ్లితే టూర్ వారం రోజుల్లో ముగిసిపోతుంది కానీ లోన్ మాత్రం మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు కట్టాల్సి వస్తుంది.

అలాగే పర్సనల్ లోన్ తీసుకొని షేర్లు కొనడం వంటివి అస్సలు చేయొద్దని చెబుతున్నారు నిపుణులు.

Telugu Products, Interest Rates, Incomes, Latest, Personal Loan, Tips-Latest New

అదేవిధంగా మరో అప్పును తీర్చడానికి పర్సనల్ లోన్ వాడకూడదు.అయితే అధిక వడ్డీ రేటు రుణాలను తక్కువ వడ్డీ రేటు రుణాలతో చెల్లించొచ్చు.కానీ ఇక్కడ చార్జీలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

ఎందుకంటే లోన్స్ ముందే క్లోజ్ చేయాలంటే బ్యాంకులు ప్రిక్లోజింగ్ చార్జీలు తీసుకుంటూ ఉంటాయి.అందువల్ల వీటిని కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

బ్యాంకులు ఈఎంఐలో ముందుగా వడ్డీ రేటును ఎక్కువగా కట్ చేసుకుంటూ వస్తాయి.అందువల్ల అసలు తక్కువగా తగ్గుతూ వస్తుంది.

అందువల్ల మీరు లోన్ ముందుగా చెల్లిస్తే అంతిమంగా నష్టపోవడమే అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube