Sai Pallavi : సాయిపల్లవి పూర్తి పేరు మీకు తెలుసా.. ఈ బ్యూటీ ఏకంగా అన్ని భాషలు మాట్లాడగలరా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ స్కిల్స్ ద్వారా అభిమానులకు దగ్గరైన హీరోయిన్లలో సాయిపల్లవి( Sai Pallavi ) ఒకరు.అయితే సాయిపల్లవి వ్యక్తిగత జీవితం గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు.

 Shocking And Interesting Facts About Saipallavi Details Here Goes Viral In Soci-TeluguStop.com

తాజాగా ఒక సందర్భంలో సాయిపల్లవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తన పూర్తి పేరు సాయిపల్లవి సింతామరై అని ఆమె చెప్పుకొచ్చారు.1992 సంవత్సరం మే నెల 9వ తేదీన నేను జన్మించానని సాయిపల్లవి అన్నారు.

హైట్ 5.4 అడుగులు అని వెయిట్ 52 కేజీలని క్వాలిఫికేషన్ డాక్టర్, యాక్టర్, డాన్సర్ అని ఆమె కామెంట్లు చేశారు.బడగా మాతృ భాష అని జార్జియం, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ మాట్లాడతానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

కన్నడ భాష అర్థమవుతుందని ఆమె వెల్లడించారు.సాయిపల్లవి ప్రస్తుతం తండేల్ సినిమా( Thandel Movie )లో నటిస్తున్నారు.

సాయిపల్లవి వయస్సు ప్రస్తుతం 31 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

తండేల్ సినిమాలో సాయిపల్లవి అద్భుతమైన రోల్ పోషిస్తున్నారని ఈ రోల్ తో ఆమె దశ తిరగడం ఖాయమని తెలుస్తోంది.నాగచైతన్య సాయిపల్లవి కాంబోలో తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించగా తండేల్ మూవీ అంతకు మించి సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.నాగచైతన్య( Naga Chaitanya )కు కూడా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదనే సంగతి తెలిసిందే.

కథను నమ్మి ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 70 కోట్ల రూపాయల రేంజ్ లో రిస్క్ చేస్తున్నారు.సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఆ మొత్తం రికవరీ చేయడం కష్టమేమీ కాదు.సాయిపల్లవి, చైతన్య కాంబో సూపర్ కాంబో అని ఈ కాంబోలో మరికొన్ని సినిమాలు రావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube