తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )పేరు ప్రస్తుతం దేశమంతటా మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం( Kodangal Assembly Constituency ) నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తుండగా రేవంత్ రెడ్డి ఇంట్లో వంట మనిషిగా పని చేసే మాణిక్యమ్మ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.సీఎం రేవంత్ రెడ్డికి నేను వంట చేసి వడ్డించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.13 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ఇంట్లో వంట మనిషిగా పని చేస్తున్నానని ఆమె తెలిపారు.
నేను ఏది వండినా ఏరోజు ఒక్కమాట కూడా అనలేదని రేవంత్ రెడ్డి నాటుకోడి కూర ( Natukodi curry )ఇష్టంగా తింటారని ఆమె చెప్పుకొచ్చారు.రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి తన వాహనంలో పండ్లు తీసుకొస్తారని మాణిక్యమ్మ( Manikyamma ) కామెంట్లు చేశారు.
రేవంత్ రెడ్డి ఇంటికి రాగానే జ్యూస్ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని ఆమె తెలిపారు.రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులంతా సొంత మనిషిలా చూసుకుంటారని మాణిక్యమ్మ కామెంట్లు చేశారు.
రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత వనపర్తిలో( Vanaparthi ) చదివారు.హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్, ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారాలను నిర్వహించిన రేవంత్ రెడ్డి 2009 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి గెలుపొందడంతో కొడంగల్ లో సొంతిల్లు నిర్మించుకున్నారు.ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కల్వకుర్తిలో కూడా ఆయన ఇంటిని నిర్మించుకున్నారు.
రేవంత్ రెడ్డి పచ్చదనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది.ఉదయం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి నిద్ర లేస్తారని అరగంట పాటు వ్యాయామం చేసి ఫ్రూట్ జ్యూస్ తీసుకుని పేపర్ చదివిన కాసేపటికే టీ తాగుతారని సమాచారం.రేవంత్ రెడ్డి మటన్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా భుజిస్తారని తెలుస్తోంది.
జొన్నరొట్టె లేదా చపాతిలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపిస్తారని తెలుస్తోంది.