ప్లాస్మాక్లస్టర్‌ అయాన్‌ సాంకేతికత కలిగిన 100 మిలియన్‌ ప్రొడక్ట్‌ యూనిట్లను అంతర్జాతీయంగా విక్రయించడాన్ని వేడుక చేస్తున్న షార్ప్‌

భూగోళంపై ప్రతి ఎయిర్‌ స్పేస్‌లోనూ ప్లాస్మాక్లస్టర్‌ అయాన్స్‌ సాంకేతికతను తీసుకురావడం లక్ష్యం 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 200 మిలియన్‌ అమ్మకాల మార్కును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది.న్యూఢిల్లీ, 09 మార్చి 2022 : షార్ప్‌ కార్పోరేషన్‌ జపాన్‌కు పూర్తి అనుబంధమైన భారతీయ అనుబంధ సంస్ధ, షార్స్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ నేడు అంతర్జాతీయంగా తాము వినూత్నమైన ప్లాస్మాక్లస్టర్‌ ను కలిగిన ఉత్పత్తులను 100 మిలియన్‌ యూనిట్లను విక్రయించడం ద్వారా అమ్మకాల పరంగామైలురాయిని చేరుకున్నట్లు వెల్లడించింది.ఎయిర్‌ ప్యూరిఫయర్‌లలో ప్లాస్మాక్లస్టర్‌ అయాన్‌ సాంకేతికతతో తొలి ఎయిర్‌ ఫ్యూరిఫయర్‌ను 2000 సంవత్సరంలో విడుదల చేశారు.

 Sharp Celebrates International Sale Of 100 Million Units Of Plasmacluster Ion Te-TeluguStop.com

ఈ మైలురాయి చేరికపై షార్ప్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, షింజీ మినాటోగవా మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో వృద్ధి చెందుతున్న శ్వాస కోశ వ్యాధుల వేళ, ప్రజలు ఇప్పుడు ఔషదాలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలను గురించి వెదుకుతున్నారు.

అక్కడ షార్ప్‌ ప్లాస్మా క్లస్టర్‌ టెక్నాలజీ తోడ్పడుతుంది.దాదాపు 35కు అంతర్జాతీయ సర్టిఫికేషన్స్‌ మరియు 10 కోట్లకు పైగా యూనిట్లను విక్రయించిన తరువాత, వైవిధ్యమైన ఇండోర్‌ అవసరాల కోసం అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమైన ఎయిర్‌ క్లీనింగ్‌ సొల్యూషన్‌గా నిలిచింది.

అవార్డులు గెలుచుకున్న మరియు సురక్షిత సాంకేతికతల ద్వారా మన ఆరోగ్యం, భద్రతకు కట్టుబడిన వేళ, గాలి కాలుష్య సంబంధిత వ్యాధుల నివారణకు విధానాలు తీసుకోవడం అవసరమని గుర్తించాము.మార్పు అనేది ఇంటి నుంచే ప్రారంభం కావాలి’’ అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ ‘‘భారతదేశంలో ప్లాస్మాక్లస్టర్‌ సాంకేతికతతో వరుసగా పలు ఉత్పత్తులను విడుదల చేశాము.వాటి ద్వారా మా వినియోగదారుల జీవితాన్ని ఆరోగ్యంగా మలచడం మాత్రమే కాదు, పన–జీవితం నడుమ సమతుల్యతనూ వృద్ధి చేస్తున్నాం.

మా ఉత్పత్తుల పట్ల విశ్వాసం చూపిన వినియోగదారులకు, భాగస్వాములకు ధన్యదాదములు తెలుపుతున్నాము.ప్రతి ఒక్కరి కోసం గాలిని స్వచ్ఛంగా ఉంచేందుకు వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించడం కొనసాగించనున్నాం’’ అని అన్నారు.

షార్ప్‌కు ప్రస్తుతం 23 ఉత్పత్తులు ప్లాస్మాక్లస్టర్‌ అయాన్‌ సాంకేతికతను కలిగి ఉన్నాయి.వీటిలో ఎయిర్‌ఫ్యూరిఫయర్లు, ఎయిర్‌ కండీషనర్స్‌, రిఫ్రిజిరేటర్లు మొదలైనవి ఉన్నాయి.2030 ఆర్ధిక సంవత్సరం నాటికి 200 మిలియన్‌ యూనిట్ల పీసీఐ టెక్నాలజీ ఉత్పత్తులు అంతర్జాతీయంగా విక్రయించాలని షార్ప్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube