దేశంలో నేటికీ క్షుద్ర విద్యలు ఆచరించే అలయాలివే!

నేటికీ భారతదేశంలోని కొన్ని దేవాలయాలలో మంత్రవిద్యలు జరగుతున్నాయి.తాంత్రికుల ఆధ్యాత్మిక సాధనలు కొనసాగుతున్నాయి.

 Temples Of India Where Witchcraft Is Done Even Today , Witchcraft , Temples , Ta-TeluguStop.com

మన భారతదేశం సనాతన ధర్మాన్ని అనుసరించేవారికి ఆలవాలంగా నిలిచింది.దేశంలోని ప్రతీ ప్రాంతంలో దేవాలయాలు కనిపిస్తాయి.

నేటికీ మన దేశంలో తంత్ర విద్యలు కొనసాగుతున్న దేవాలయ వివరాలు ఇవే.

వేటల్ టెంపుల్, ఒడిశా ముందుగా ఒడిశాలో ఉన్న వేటల్ దేవాలయం గురించి తెలుసుకుందాం.ఈ ఆలయం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఉంది.ఈ ఆలయం 8వ శతాబ్దంలో నిర్మితమయ్యింది.ఈ ఆలయంలో శక్తివంతమైన చాముండ విగ్రహం ప్రతిష్టించారు.శక్తివంతమైన చాముండను కాళి రూపంగా భావిస్తారు.

ఒడిశాలోని ఈ ఆలయంలో ఎప్పుడూ తాంత్రిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.

Telugu Assam, Baijnath Temple, Kalabhairava, Kalighat Temple, Kamakhya Temple, K

బైజ్నాథ్ ఆలయం, హిమాచల్ ప్రదేశ్ బైజ్‌నాథ్ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది.ఈ ఆలయంలో శివుడు కొలువైవున్నాడు.ఈ ఆలయంలో శివుడు పూజలందుకుంటున్నాడు.

ఇక్కడ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.ఈ ఆలయంలోని నీరు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.

ఈ ఆలయంలో కూడా తాంత్రిక కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

కాళీఘాట్ ఆలయం, కోల్‌కతా కాళీఘాట్ ఆలయం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉంది.

తాంత్రిక కార్యక్రమాలలో మునిగిపోయే భక్తులతో కాళీఘాట్ ఆలయం నిండివుటుంది.ఏడాది పొడవునా తంత్ర-మంత్రాలు చేసే వారు ఇక్కడ ఉంటారు.

ఈ ప్రదేశంలో సతీదేవి చేతివేళ్లు పడ్డాయని చెబుతారు.

Telugu Assam, Baijnath Temple, Kalabhairava, Kalighat Temple, Kamakhya Temple, K

కామాఖ్య దేవాలయం , అస్సాం అస్సాంలోని కామాఖ్య దేవాలయం తంత్ర కార్యకలాపాలకు కంచుకోటగా పరిగణిస్తారు.ఈ ప్రదేశంలో అమ్మవారి యోని పడిందని చెబుతారు.ఇక్కడ ఎప్పుడూ తాంత్రికులు ఉంటారు.

Telugu Assam, Baijnath Temple, Kalabhairava, Kalighat Temple, Kamakhya Temple, K

కాల భైరవ దేవాలయం, మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న కాలభైరవ దేవాలయంలో భైరవుని నల్లని విగ్రహాన్ని పూజిస్తారు.తాంత్రిక, అఘోరీ సిద్ధుల కోసం దేశం నలుమూలల నుండి సాధకులు ఇక్కడికి వస్తారు.

బాలాజీ దేవాలయం, రాజస్థాన్ ఈ ఆలయం రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఉంది.మెహందీ పూర్ బాలాజీ ఆలయం తంత్ర కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది.ఈ ఆలయానికి తంత్ర శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube