మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడాన్ని చాలామంది వ్యతిరేకిస్తారు.కానీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం అనేది సర్వసాధారణమైన విషయం అనే చెప్పాలి.
అలాగే మన భారత దేశంలో పెళ్ళికి ముందు సెక్స్ చేయడాన్ని చాలా మంది తప్పుబాడుతూ ఉంటారు.మన కట్టుబాట్లు, సంప్రదాయాల ప్రకారం వేద మంత్రాల సాక్షిగా పెళ్లి అయిన తర్వాతనే కాపురం.
చేయడం అనేది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం.మరి అలాంటి మనదేశంలో కూడా పెళ్ళికి ముందు ఎవరితో అయినా శృగారంలో పాల్గొంటే తప్పేమి లేదనే ఒక సంప్రదాయ పద్దతిని అవాలిబించే పల్లెవాసులు కూడా ఉన్నారని మీకు తెలుసా.? అవును మీరు విన్నదే నిజమే.
అక్కడ పెళ్లికి ముందే యువత సెక్స్‌లో ఎంత మంది నచ్చితే అంత మందితో శృంగారంలో పాల్గొనవచ్చట.
అసలు వివరాల్లోకి వెళితే.ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాల్లో ఉండే గోండు, మురియా తెగకు చెందిన గిరిజనుల ఆచార, సంప్రదాయలు కాస్త విభిన్నంగా ఉంటాయి.
వాటిని భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు వింటే తప్పకుండా ఆశ్చర్య పోతారు.ఛత్తీస్‌గఢ్ లోని ఈ గిరిజనల తెగలు ఘోతుల్ అనే సంప్రదాయాన్ని తుచ్చా తప్పకుండా పాటిస్తారు.
అసలు ఇంతకీ ఘోతుల్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద వెదురు బొంగులతో ఒక ఇంటిని నిర్మిస్తారు.అంటే ఇవి మన పట్టణ ప్రాంతాల్లో ఉండే నైట్ క్లబ్ లా మాదిరిగా ఉంటాయట.10 ఏళ్లు నిండిన పిల్లలు ఎవరైనా ఘోతుల్ కు వెళ్లవచ్చు.ఘోతుల్ లోకి వెళ్లి ఏదైనా చేసే స్వేచ్ఛ వారికి ఉంటుంది.
అక్కడ నచ్చిన యువతీ యువకులతో స్వతంత్రగా సెక్స్ లో పాల్గొనవచ్చు.

తల్లి దండ్రులు కూడా వాళ్ళని ఏమి అనరు.వివాహానికి ముందే కోరుకున్నంత మందితో సంబంధం పెట్టుకోవచ్చు.ఘోతుల్ లో భాగంగా యువతీ యువకులు పాటలు పాడుకుంటూ ఒకరితో మరొకరు కలిసి డాన్సులు కూడా చేస్తుంటారు.
అలాగే అక్కడి యువకులు ఎవరన్నా అమ్మాయిని ఇష్టపడితే ఆమె కోసం ప్రత్యేకంగా వెదురు బొంగుతో తయారుచేసిన దువ్వెనను తీసుకుని వెళ్లి ఆ దువ్వెనను ఆమె తలలో ఉంచుతారు.ఒకవేళ ఆ యువతి ఆ యువకుడిని ఇష్టపడితే అలాగే జట్టులో ఉంచుకుంది.
అప్పుడు వారిద్దరూ కలిసి జీవించవచడంతో పాటు శృంగారంలో కూడా పాల్గొనవచ్చు.కొన్నాళ్ళు గడిచిన తరువాత ఒకరినొకరు ఇష్టపడితే ఇరువురికి కలిపి పెద్దలు పెళ్లి కూడాచేస్తారు.
ఒకేవేళ ఆమెకు అతను నచ్చకపోతే ఆ దువ్వెనను తీసేస్తుంది.అలా సహజీవనం చేసిన తర్వాత గర్భం దాల్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
అయితే చాలా మంది గర్భంతోనే పెళ్లిళ్లు కూడా చేసుకున్నవారు ఉన్నారు.అయితే ఈ సంప్రదాయం కారణంగా ఆ గిరిజన ప్రాంతంలో అసలు లైంగిక వేధింపులనేవే ఉండవని, ఇప్పటి వరకు అలాంటి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్థానికులు వెల్లడించారు.