కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ సినిమాలలో కన్నా ఏదో ఒక వివాదం ద్వారా సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు.ఈ క్రమంలోనే ఈయన ఏదో ఒక విషయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే గతకొద్ది రోజుల క్రితం ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనలో భాగంగా అతని పై దాడి చేయడంతో సైనానెహ్వాల్ ఈ దాడిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ పై సిద్ధార్థ్ సైనా నెహ్వాల్ ను పరోక్షంగా అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఈ క్రమంలోనే జాతీయ మహిళా కమిషన్ సైతం సదురు హీరోపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు పోలీసులను కోరారు.అలాగే ఈ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు, తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆమెకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా తాజాగా మరోసారి సిద్ధార్థ్ సైనా నెహ్వాల్ బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు తమిళనాడు పోలీసులు హీరో సిద్ధార్థ్ ను విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు.
ఈ క్రమంలోనే సిద్ధార్థ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసుల ముందు హాజరయ్యారు.ఈ క్రమంలోనే సిద్ధార్థ్ మాట్లాడుతూ తాను ఉద్దేశ్యపూర్వకంగా ఎవరిని కించ పరిచే విధంగా మాట్లాడలేదని మరోసారి పోలీసుల ఎదుట తెలియజేస్తూ సైనా నెహ్వాల్ కు క్షమాపణలు తెలియజేశారు.ఇలా సిద్ధార్థ్ నిత్యం ఏదో ఒక వివాదంతో ద్వారా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.