ఏబ్సెలిన్‌తో 'కరోనా వైరస్'కు చెక్!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించేస్తోంది.

 Corona Virus, Covid-19, Scientists, Psychiatric Medicine, Psychiatric Medicine-TeluguStop.com

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లమంది ప్రజలకు కరోనా వైరస్ వ్యాపించింది.అందులో కోటి 50 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా 7 లక్షలమందికిపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.

నాలుగు రోజులు క్రితం రష్యా సైతం ఓ వ్యాక్సిన్ విడుదల చేసింది.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కట్టడి చేసే సామర్ధ్యం ఏబ్సెలిన్‌ అనే ఔషధాన్ని ఉందని అమెరికా శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

సాధారణంగా ఆ ఔషధం వినికిడి సమస్యలు, మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తుందని ఇప్పుడు కరోనాని కూడా కట్టడి చెయ్యగలదు అని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనతో ప్రాథమిక అంచనాకు వచ్చారు.

కరోనా వైరస్ అణువుల్లోని ప్రొటీస్‌, ఎం-ప్రో వంటి ఎంజైమ్‌లు వైరస్‌ అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తున్నట్టు.

ఆ ఎంజైమ్‌ల వృద్ధిని కట్టడి చేయడంలో ‘ఏబ్సెలిన్‌’ ఔషధం మెరుగ్గా పనిచేస్తుంది వారు గుర్తించారు.కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌ సాంకేతికత సాయంతో దీన్ని కనుగొన్నట్టు వారు తెలిపారు.

అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు చెయ్యాల్సి ఉందని వారు తెలిపారు.కాగా మనుషులపై ఏబ్సెలిన్‌ ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించబోదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube