తనే నా ఫేవరెట్ హీరోయిన్... తనతో పని చేయడానికి ఎప్పుడు తాను సిద్ధమే: సంజయ్ లీలా బన్సాలీ

వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పెట్టింది పేరు.బాలీవుడ్ ఇండస్ట్రీలో పీరియాడికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

 Sanjay Leela Bhansali Says Alia Bhatt His Favorite Heroine Details, Sanjay Leela-TeluguStop.com

సంజయ్ లీలా దర్శకత్వం అంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తప్పనిసరిగా విజయాన్ని అందుకుంటుందనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.ఇక ఈయన దర్శకత్వం వహించడమే కాకుండా ఆయన దర్శకత్వం వహించే సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తారు.

ఇక తాజాగా సంజయ్ లీలా దర్శకత్వంలో అలియా భట్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘గంగుబాయి కతియావాడి’.ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీ విడుదలయ్యి విశేషమైన గుర్తింపు సంపాదించుకుంది.

ఇందులో అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే తాజాగా హీరోయిన్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ జరిపిన సంభాషణలో భాగంలో భన్సాలీ పలు ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న నటీమణులలో అలియాభట్ తన ఫేవరెట్ హీరోయిన్ అని తెలియజేశారు.

Telugu Alia Bhatt, Bollywood, Sanjayleela, Favorite, Heart Stone-Movie

అంతేకాకుండా మరోసారి అలియాతో సినిమా చేయడానికి మీరు సిద్ధమేనా అని ప్రశ్నించగా అందుకు దర్శకుడు తనతో సినిమాలు చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అలియా తెలుగు ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.అదేవిధంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ‘హర్ట్ ఆఫ్ స్టోన్‌’తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube