గత ఏడాది బాలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది.ఈ డ్రగ్స్ కేసులో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఉన్న రాగిణి ద్వివేది, సంజనా గల్రానిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించి రెండు నెలల పాటలు జైల్లోనే ఉంచారు.
సెలబ్రెటీలుగా అద్భుతమైన ఫేమ్ ని అనుభవించిన ఈ అందాల భామలు ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలు జీవితం అనుభవించడం వారి జీవితంలో ఒక విషాదకర ఘటనగా మిగిలిపోతుంది.వారు తప్పుచేశారా, లేదా అనేది చట్టం నిర్ధారించడానికి చాలా సమయం పట్టేస్తుంది.
అయితే సెలబ్రెటీలు ఎంతో మంది అభిమానులని సొంతం చేసుకున్న వారి వ్యక్తిత్వానికి ఈ కేసు ఓ మచ్చలాగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అలాగే బాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న రియా చక్రవర్తికి డ్రగ్స్ ర్యాకెట్ పెద్ద అడ్డంకిగా మారే అవకాశం అయితే ఉంది.

అయితే డ్రగ్స్ కేసులో జైలు జీవితం అనుభవించి బెయిల్ పై బయటకి వచ్చిన తర్వాత కన్నడ హీరోయిన్ సంజన గల్రాని ఎక్కువగా బయట తిరగకుండా ఇంటివద్దనే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుందనీ టాక్.కావాలనే తనని ఈ కేసులో ఇరికించారని, తన ఇమేజ్ డ్యామేజ్ చేశారని ఆమె శాండల్ వుడ్ కిచెందిన కొంత మంది మీద చాలా ఆగ్రహంతో ఉందని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఇకపై సినిమాలు కన్నడ ఇండస్ట్రీలో చేయకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు బోగట్టా.తాజాగా కోలీవుడ్ లో ఆమెకి ఒక మూవీ ఆఫర్ వచ్చిందని దానికి వెంటనే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది.
త్వరలో ఆ సినిమాకి సంబంధించి క్లారిటీ వస్తుందని తెలుస్తుంది.ఇక ఈ షూటింగ్ లో బిజీ అయ్యి చేదు జ్ఞాపకాల నుంచి బయటకి రావాలని సంజన అనుకుంటున్నట్లు సమాచారం.