తెలుగునాట విజయ్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ సాధించకపోయినా తమిళనాడులో మాత్రం నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీనిచ్చే హీరోల జాబితాలో విజయ్ ముందువరసలో ఉంటారు.విజయ్ నటించిన వారిసు సినిమా మొదట 12వ తేదీన రిలీజవుతుందని మేకర్స్ ప్రకటించగా ఆ తర్వాత తమిళంలో తునివు డేట్ కు అనుగుణంగా 11వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.
వారసుడు మూవీ బుధవారం రోజున థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా సద్వినియోగం చేసుకోనుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే విజయ్ సంఘవి కాంబినేషన్ లో చాలా సంవత్సరాల క్రితం రసిగన్ సినిమా తెరకెక్కగా ఆ సినిమాకు సంబంధించిన షాకింగ్ విషయాలను తాజాగా ఆమె మీడియాతో పంచుకున్నారు.
ఆ సినిమాకు విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్టర్ అని ఆమె తెలిపారు.
ఒక సన్నివేశంలో భాగంగా చెరువులో నేను విజయ్ రొమాంటిక్ సీన్ లో నటించాల్సి ఉందని ఆ సీన్ లో నేను బాగానే నటించినా విజయ్ మాత్రం సరిగ్గా చేయలేదని ఆమె కామెంట్లు చేశారు.ఆ సమయంలో సరిగ్గా రొమాన్స్ చేయలేదని విజయ్ తండ్రి విజయ్ ను తిట్టారని ఆమె చెప్పుకొచ్చారు.ఆ సన్నివేశంలో నటించడం కోసం విజయ్ పడిన ఇబ్బంది అంతాఇంతా కాదని సంఘవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు సంఘవి ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు.సంఘవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.వారసుడు సినిమా రిలీజ్ సమయంలో సంఘవి విజయ్ గురించి ఇలాంటి విషయాలను వెల్లడించడం సరికాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.విజయ్ ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉన్నాడో గమనించాలని కొంతమంది సంఘవికి సూచిస్తున్నారు.