టాలీవుడ్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డెవిల్.( Devil Movie ) అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది.కాగా ఈ మూవీ డిసెంబర్ 29న రిలీజ్ కానుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది.పీరియాడికల్ మూవీగా బ్రిటీష్ కాలం నాటి కథతో డెవిల్ ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేసింది.
అయితే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ తో ఫ్లాప్ అందుకున్నాడు.డెవిల్ తో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడు.

డెవిల్ సినిమాలో సంయుక్త( Samyuktha Menon ) హీరోయిన్ గా నటించడం కూడా కలిసి వచ్చే అంశమే అని చెప్పవచ్చు.మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన అమ్మడు తెలుగులో వరుస హిట్లు అందుకుంటుంది.భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష ఇలా హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తుంది సంయుక్తా మీనన్.తన లక్కీ ఛార్మ్ ఈ సినిమాకు కూడా కలిసి రావాలని చూస్తోంది.అయితే సంయుక్త ఈ సినిమాలో ఉంటే హిట్ పక్కా అనే క్రేజ్ తెచ్చుకుంది.దానికి తగినట్టుగానే డెవిల్ రిజల్ట్ వస్తే మాత్రం ఆమెని ఆపడం కష్టమని చెప్పవచ్చు.
అలాగే ఈ సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధిస్తే నందమూరి అభిమానులకు( Nandamuri Fans ) కూడా పండగే.

డెవిల్ సినిమా ట్రైలర్ తో( Devil Movie Trailer ) బజ్ పెంచే ప్రయత్నం చేసినా సినిమా దర్శకుడి మార్పు సందేహాలకు దారి తీస్తుంది.అయితే వివాదం పెద్దది కాకుండానే చూశారు.ఈ సినిమాకు కూడా సంయుక్త హిట్ సెంటిమెంట్ కలిసి వస్తుందేమో చూడాలి మరి.టాలీవుడ్ లక్కీ హ్యాండ్ గా మారిన సంయుక్త మీనన్ సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది.అయితే డెవిల్ సినిమా సక్సెస్ అయితే మాత్రం అమ్మడి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు.