సంపంగి హీరోయిన్‌కి ఇంత పెద్ద కొడుకులు ఉన్నారా.. ఆ హీరోను పెళ్ళాడిందా ?

బ్లాక్ బస్టర్ హిట్ సంపంగి( Sampangi ) సినిమా ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా అలరించింది.ఈ సినిమాలో సల్వార్ రిజ్వానా అనే ముస్లిం అమ్మాయి పాత్ర చేసిన నటిని ఎవరూ మర్చిపోరు.

 Sampangi Heroine Family Details , Kanchi Kaul , Tollywood, Sampangi ,family-TeluguStop.com

ఆమె పేరు కంచి కౌల్‌( Kanchi Kaul ) 1990 కాలంలో పుట్టిన తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ కచ్చితంగా గుర్తుండే ఉంటుంది.ఎందుకంటే 2001 లో హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ తో వచ్చిన సంపంగి సినిమా చాలామంది హృదయాలను దోచేసింది.

ఇందులోని “అందమైన కుందనాల బొమ్మరా” పాట ఎంతలా హిట్ అయిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.ఆ పాట సాహిత్యానికి తగినట్లే కంచి కౌల్‌ అందంగా ఉండి కుర్ర కారుకు డ్రీమ్ గర్ల్ గా కూడా మారింది.

ఈ మూవీలో ఆమె పాత్రని చాలా అద్భుతంగా రాశారు.దీని తర్వాత ఈ తార ఫ్యామిలీ సర్కస్ సినిమాలో కూడా నటించి మెప్పించింది.ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది కానీ అవి పెద్దగా ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు.2004 తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి హిందీ సీరియల్ లో నటించిన ప్రారంభించింది.2014 వరకు ఆమె సీరియల్స్ లో కనిపించింది.

2011వ సంవత్సరంలో షబీర్ అహ్లువాలియా( Shabir Ahluwalia ) అనే హిందీ సీరియల్ హీరో, సినిమా నటుడిని పెళ్లి చేసుకుంది.వీరిద్దరూ 13 ఏళ్లుగా అన్యోన్యమైన జీవితం గడుపుతున్నారు.నిజానికి వీరిది ప్రేమ పెళ్లి.

కంచి కౌల్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు.వారు ఈ నటి కంటే ఇప్పుడు చాలా ఎత్తు అయిపోయారు.

అయితే వారి పక్కన నిల్చుంటే ఈ ముద్దుగుమ్మ వారికి అక్క లాగానే కనిపిస్తుంది కానీ తల్లిలాగా అసలు కనిపించదు.అంటే ఆమె సంపంగి సినిమాలో ఎంత అందంగా కనిపించిందో ఇప్పుడు కూడా అంతే అందంగా, ఫిట్‌గా కనిపిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పంచదార బొమ్మకు 5 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.వారందరి కోసం తరచుగా ఫోటోలను, వీడియోలను పంచుకుంటుంది.

ఫ్యామిలీ లైఫ్ కి సంబంధించిన పిక్స్ కూడా షేర్ చేస్తుంది.తాజాగా ఈ నటి తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో ఆమె చాలా యవ్వనంగా కనిపించింది.నిజానికి ఆమె వయసు 42 ఏళ్లకు పైగానే ఉంటుంది.

అయినను 30 ఏళ్ల ప్రాయంలో ఉన్నట్లు సెక్సీ కర్వ్స్‌తో కనిపిస్తూ మతులు పోగొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube